Mumbai Test : స్వదేశంలో పెద్ద జట్లను సైతం మట్టికరిపించిన భారత జట్టు (Team India) తొలిసారి తడబడుతోంది. న్యూజిలాండ్‌కు పోటీ ఇవ్వలేక 12 ఏండ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా విజయం కోసం నిరీక్షిస్తోంది. వరుసగా బెంగళూరు, పుణే టెస్టులో ఓడిన రోహిత్ సేన ముంబైలో భారీ తేడాతో గెలిస్తేనే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు మెరుగుపడుతాయి. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనే వైట్‌వాష్ తప్పించుకోవాలనుకుంటున్న భారత్.. ‘ఫ్లయింగ్ కిస్’ పేసర్‌ను స్క్వాడ్‌లోకి తీసుకుంది.
ఐపీఎల్లో అదరగొట్టి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన హర్షిత్ రానాను సెలెక్టర్లు ముంబై టెస్టు కోసం పిలిచారు. అలాగని పేస్ యూనిట్లో ఎవరూ గాయపడలేదు. అయినా సరే.. హర్షిత్‌ను తీసుకోవడానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే.. రెండు టెస్టుల్లోనూ యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah), సిరాజ్.. పుణేలో ఆకాశ్ దీప్(Akash Deep)లను న్యూజిలాండ్ బ్యాటర్లు ఉతికేశారు.
HARSHIT RANA IN INDIAN TEAM…!!!!! 🇮🇳
– Harshit Rana has been included in the Indian team for the third Test. [Pratyush Raj From Express Sports] pic.twitter.com/YsxJWzOjyz
— Johns. (@CricCrazyJohns) October 29, 2024
ఈ నేపథ్యంలో సిరీస్‌లో బోణీ కొట్టాలంటే వైవిధ్యమైన పేసర్ అవసరం అనివార్యమైంది. అందుకని హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మలు హర్షిత్‌ను మళ్లీ వెనక్కి పిలిచారు. కివీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌కు ట్రావెల్ రిజర్వ్‌గా ఎంపికైన హర్షిత్‌కు తొలి రెండు టెస్టుల్లో చోటు దక్కలేదు. దాంతో, పేసర్‌ను రంజీ ట్రోఫీ ఆడేందుకు అనుమతించాలని ఢిల్లీ జట్టు కోరింది. అందుకని బీసీసీఐ పుణే టెస్టు సమయంలో హర్షిత్‌ను స్క్వాడ్ నుంచి విడుదల చేసింది.
The first New Zealand team to win a Test series in India 🏏 #INDvNZ #CricketNation pic.twitter.com/WukPYYyrot
— BLACKCAPS (@BLACKCAPS) October 26, 2024
కానీ, పుణే పిచ్ మీద కివీస్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) విజృంభణతో భారత జట్టు అనూహ్యంగా సిరీస్ కోల్పోయింది. అందుకని సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌కోసం హర్షిత్‌ను మళ్లీ రప్పించారు. హర్షిత్ తుది జట్టులోకి వస్తే.. ఆకాశ్ దీప్ లేదా సిరాజ్‌లలో ఒకరు బెంచ్ మీద ఉండాల్సిందే. కివీస్, భారత్‌ల మధ్య నామమాత్రమైన మూడో టెస్టు నవంబర్ 1వ తేదీన జరుగనుంది.
భారత స్క్వాడ్ : రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్, హర్షిత్ రానా, జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్.