England Cricket : సుదీర్ఘ ఫార్మాట్లో బజ్‌బాల్ ఆటతో సంచలనాలు సృష్టించిన ఇంగ్లండ్ (England) ఆసియా గడ్డపై సిరీస్ కోల్పోయింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో గెలుపొందినా.. వరుసగా రెండు మ్యాచుల్లో పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడింది. ఈ ఓటమి బాధ నుంచి తేరుకునేందుకు ఇంగ్లండ్ మరో సిరీస్‌కు సిద్ధమైంది. టీమిండియాపై వరుస విజయాలతో సిరీస్ గెలుపొందిన న్యూజిలాండ్ (Newzealand)తో ఇంగ్లీష్ టీమ్ తలపడనుంది. అందుకని బెన్ స్టోక్స్ సారథిగా సెలెక్టర్లు 16 మందితో కూడిన స్క్వాడ్‌ను ఎంపిక చేశారు.
ఫార్మాట్ ఏదైనా గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇచ్చే ఇంగ్లండ్ బోర్డు ఈసారి కూడా బలమైన స్క్వాడ్‌ను ఎంచుకుంది. జాతీయ జట్టులో చోటు కోసం నిరీక్షిస్తున్న యువ ఆల్‌రౌండర్ జాకబ్ బెథెల్ (Jacob Bethell)కు తొలిసారి అవకాశమిచ్చారు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన జాకబ్ వార్విక్షైర్ జట్టు తరఫున అద్భుతంగా రాణిస్తున్నాడు. అందుకని పితృత్వ సెలవుల్లో ఉన్న జేమీ స్మిత్ స్థానంలో అతడిని ఎంపిక చేశారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC 202-25) ఫైనల్ రేసులో వెనకబడిన ఇంగ్లండ్ నవంబర్‌లో కివీస్ గడ్డపై మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది.
Next Test stop: New Zealand ✈
Thoughts on our squad? 🏏
🇳🇿 #NZvENG 🏴 #EnglandCricket pic.twitter.com/WnUHhrgx3d
— England Cricket (@englandcricket) October 29, 2024
ఇంగ్లండ్ స్క్వాడ్ : బెన్ స్టోక్స్(కెప్టెన్), జాక్ క్రాలే, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, ఓలీ పోప్, జో రూట్, బ్రౌడన్ కర్సే. మాథ్యూ పాట్స్, గస్ అట్కిన్సన్, క్రిస్ వోక్స్, జాక్ లీచ్, రెహ్మాన్ అహ్మద్, ఓలీ స్టోన్, జాకబ్ బేథెల్, జోర్డాన్ కాక్స్, షోయబ్ బషీర్,
పాకిస్థాన్ పర్యటనలో చావుదెబ్బ తిన్న ఇంగ్లండ్ ఈ మూడు టెస్టుల సిరీస్‌లో విజయమే లక్ష్యంగా ఆడనుంది. అందుకని స్క్వాడ్‌లో ఆల్రౌండర్లకు చోటు కల్పించింది. క్రిస్ట్‌చర్చ్‌లోని హగ్లే ఓవల్ మైదానంలో నవంబర్ 28న ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. అనంతరం డిసెంబర్ 6వ తేదీన వెల్లింగ్టన్లో రెండో టెస్టు, హమిల్టన్‌లో డిసెంబర్ 14న మూడో టెస్టు నిర్వహించనున్నారు.