అమరావతి : విజయవాడలో ఓ ఈవెంట్ డ్యాన్సర్ (Event Dancer) అనుమానాస్పదంగా మృతి చెందడం నగరంలో కలకలం రేపుతుంది. కాకినాడకు(Kakinada) చెందిన బంటుపల్లి వెంకటలక్ష్మి(25) హైదరాబాద్‌లో ఈవెంట్ డ్యాన్సర్‌గా హైదరాబాద్‌లో పనిచేస్తుంది. ఈనెల 28న విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆమె స్నేహితురాలు జ్యోతి ఇంటికి వెళ్లింది. అక్కడ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని స్నేహితురాలు జ్యోతి పోలీసులకు సమాచారం అందించింది.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె ఒంటిపై గాయాలు ఉండడంతో హత్యగా భావిస్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేదా ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.