Swapnil Kusale | పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ (త్రీ పీ)లో భారత యువ షూటర్ స్వప్నిల్ కుసాలె (Swapnil Kusale) కాంస్య పతకం (Bronze medal) గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వప్నిల్‌కు లోక్‌సభ (Lok Sabha) అభినందనలు తెలిపింది. శుక్రవారం ఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ఓంబిర్లా (Speaker Om Birla) సభ తరఫున యువ షూటర్‌కు అభినందనలు తెలిపారు.
కాగా, గురువారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ (త్రీ పీ) ఫైనల్లో స్వప్నిల్ సత్తా చాటిని విషయం తెలిసిందే. క్వాలిఫికేషన్ రౌండ్లో ఏడో స్థానంలో నిలిచి ఎనిమిది మంది అర్హత సాధించిన ఫైనల్లో స్వప్నిల్ 451.4 పాయింట్లు స్కోర్‌తో మూడో స్థానంలో నిలిచాడు. తద్వారా కాంస్య పతకాన్ని ముద్దాడాడు.
ఇక ఐదు రోజుల వ్యవధిలోనే మను భాకర్, సరభ్‌జ్యోత్ సింగ్, స్వప్నిల్..షూటింగ్లో మూడు పతకాలు అందించడం గమనార్హం. ఈ సందర్భంగా స్వప్నిల్ మరో రికార్డు సృష్టించాడు. దేశానికి ముచ్చటగా మూడో పతకాన్ని అందించడమే గాక ఈ ఈవెంట్లో పతకం నెగ్గిన తొలి భారతీయుడిగా కూడా స్వప్నిల్ చరిత్ర సృష్టించాడు.
On behalf of Lok Sabha, Speaker Om Birla, extended congratulations to Swapnil Kusale on winning the Bronze medal in the Men’s 50m Rifle event at the Paris Olympics, 2024. pic.twitter.com/v5Si79zBzM
— ANI (@ANI) August 2, 2024
Also Read..
Intel lays off | ఉద్యోగులకు షాకిచ్చిన టెక్ దిగ్గజం ఇంటెల్.. 18 వేల మందిపై వేటు
Wayanad | 300 దాటిన వయనాడ్ మృతులు.. ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు
Bomb Threat | ఢిల్లీ పాఠశాలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు