Intel lays off | కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం సంకేతాల నేపథ్యంలో దాదాపు అన్ని సంస్థలు తమ ఉద్యోగుల్ని ఎడాపెడా పీకేసిన విషయం తెలిసిందే. చిన్నా, పెద్ద కంపెనీలన్న తేడా లేకుండా అన్ని సంస్థలూ ఉగ్యోలకు లేఆఫ్స్ ప్రకటించాయి. ఈ ఏడాది కూడా చాలా సంస్థలు లేఆఫ్స్‌ను కొనసాగించాయి. అమెజాన్, ట్విట్టర్, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలా ఎన్నో దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించాయి. భారత్‌కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థలూ ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గించుకున్నాయి. అయితే ఇటీవలే పరిస్థితులు మెరుగుపడ్డాయి అనుకునేలోపే కొత్త ఆర్థిక సంవత్సరంలో మరోసారి లేఆఫ్స్ పర్వం ఉద్యగులను ఆందోళనకు గురిచేస్తోంది.
తాజాగా అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ సంస్థ ఇంటెల్ భారీఎత్తున ఉద్యోగాల తొలగింపుకు (Intel Job Cuts) సిద్ధమైంది. సంస్థలో పనిచేస్తున్న దాదాపు 18 వేల మందిని తొలగించాలని నిర్ణయించింది. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది దాదాపు 15 శాతానికి సమానం. ఈ మేరకు కంపెనీ సీఈవో కీలక ప్రకటన చేశారు. ‘రెండో త్రైమాసికం ఫలితాలు నిరాశపరిచాయి. చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. ఉత్పత్తులు, తయారీ ప్రక్రియలో ఎన్నో మైలురాళ్లను అధిగమించినప్పటికీ.. ఫలితాలు ఆశించిన స్థాయిలో మాత్రం లేవు. దీంతో కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో ఇంకా కఠిన సవాళ్లతో కూడిన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని తెలిపారు.
ఇటీవలే ముగిసిన త్రైమాసికంలో కంపెనీ 1.6 బిలియన్ డాలర్ల వరకు నష్టం నమోదు చేసింది. ఇక ఇంటెల్ కంపెనీలో గత ఏడాది చివరి నాటికి 124,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో 15 శాతం మందిని తొలగించాలని తాజాగా కంపెనీ నిర్ణయించింది. ఇప్పుడు ఉద్యోగుల్ని తొలగించడం వల్ల ప్రతి సంవత్సరం ఇంటెల్‌కు.. 20 బిలియన్ డాలర్ల వరకు ఖర్చులు తగ్గుతాయని అంచనా.
Also Read..
Hamas Chief | రెండు నెలల ముందే బాంబు పెట్టి.. పక్కా ప్లాన్‌తో హమాస్ అధినేత హనియా హత్య
Wayanad | 300 దాటిన వయనాడ్ మృతులు.. ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు
Bomb Threat | ఢిల్లీ పాఠశాలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు