Wayanad | కేరళ రాష్ట్రంలోని వయనాడ్ (Wayanad) జిల్లాలో మృత్యుఘోష కొనసాగుతోంది. మెప్పిడి పరిసర ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున పలుమార్లు కొండచరియలు (landslides) విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శుక్రవారం నాటికి 300 దాటింది.
ఈ విలయంలో మరణించిన వారి సంఖ్య 308కి చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. మరోవైపు చలియార్ నదిలోనే ఇప్పటివరకు 144 మృతదేహాలు లభ్యమయ్యాయి. సుమారు 200 మందికిపైగా ప్రజలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రమాద స్థలం నుంచి సుమారు 1000 మందికిపైగా బాధితులను రెస్క్యూ టీమ్ రక్షించింది.
#WATCH | Kerala: Search and rescue operations continue at landslide-affected Chooralmala in Wayanad.
Death toll stands at 308, as per Kerala Health Minister pic.twitter.com/wzaZrps7RT
— ANI (@ANI) August 2, 2024
శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నారు (Rescue Operations). శుక్రవారం వరుసగా నాలుగో రోజు కూడా ఆ ప్రాంతంలో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్, భారత నేవీ రెస్క్యూ ఆపరేషన్స్‌ను కొనసాగిస్తున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్స్‌లో బాధితులను గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత రాడాన్‌ను (drone based radar) కూడా వినియోగిస్తున్నారు.
ఘటన నేపథ్యంలో ప్రభుత్వం 82 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. అందులో సుమారు 8,204 మందికిపైగా ఆశ్రయం పొందుతున్నారు. కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాల్లో గురువారం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించి బాధితులను పరామర్శించారు.
#WATCH | Kerala: Search and rescue operations continue at landslide-affected Mundakkai, Chooralmala in Wayanad.
Death toll stands at 308, as per Kerala Health Minister pic.twitter.com/G8thUNhWcC
— ANI (@ANI) August 2, 2024
31 గంటల్లో వంతెన నిర్మాణం
కొండచరియలు విరిగిపడ్డప్పుడు చూరల్మల, ముండక్కై మధ్య ఉన్న వంతెన కూలిపోవడం సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది. దీంతో ఆర్మీలోని మద్రాస్ ఇంజినీర్ గ్రూప్ బృందానికి చెందిన 140 మంది ఇక్కడకు చేరుకొని కొత్త వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. 31 గంటల పాటు శ్రమించి 190 అడుగుల బెయిలీ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీంతో ముండక్కైలో సహాయక చర్యలు వేగం పుంజుకున్నాయి.
Also Read..
Nagarjuna Sagar | 4 గంటలకు సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల..
Road Accident | రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఫ్లై ఓవర్ గోడను ఢీకొట్టి నుజ్జునుజ్జు అయిన కారు
Rahul Gandhi: నాపై ఈడీ దాడికి ప్లాన్ వేశారు: రాహుల్ గాంధీ