కాజీపేట, జనవరి 5 : అదుపు తప్పిన బైక్(Bike accident) డివైడర్ను ఢీ కొట్టిన సంఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి చేరుకున్న సంఘటన కాజీపేట పట్టణంలో(Kazipet) సోమవారం చోటు చేసుసుకుంది. స్థానికులు, 108 సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని విష్ణుపురికి చెందిన యాంసాని ప్రవీణ్ కుమార్ (23) బైకుపై అతివేగంగా వెళుతూ అదుపుతప్పి పట్టణంలోని డి మార్ట్ సమీపంలోని డివైడర్ను ఢీ కొట్టారు.
ఈ ఘటనలో ప్రవీణ్ కుమార్ కు తీవ్ర గాయాలై కుడి కాలు విరిగి, అపస్మారక స్థితిలోకి చేరుకున్నట్లు తెలిపారు. దీంతో స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. సంఘటనకు చేరుకున్న 108 సిబ్బంది మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.