Bomb Threat | దేశరాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. ఇటీవలే రాజధాని నగరంలోని పలు పాఠశాలలకు (Delhi School) వరుస బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ పాఠశాలకు ఇలాంటి బెదిరింపులే రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో (Greater Kailash area) గల ఓ పాఠశాలకు గురువారం బాంబు బెదిరింపులు వచ్చాయి. పాఠశాలను బాంబుతో పేల్చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు స్కూల్లో బాంబు పెట్టినట్లు గురువారం మెయిల్ వచ్చిందని ఢిల్లీ పోలీసులు శుక్రవారం తెలిపారు. సమాచారం అందిన వెంటనే సదరు పాఠశాల వద్దకు వెళ్లి తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు.
అయితే ఆ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలూ లభించలేదన్నారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ మెయిల్ ఆధారంగా ఆగంతకులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. వారిని త్వరలో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు శుక్రవారం వెల్లడించారు.
An email was received at a school in Delhi’s Greater Kailash area, threatening to blow up the school with a bomb. It is written in the email that a bomb was planted in the school yesterday. Nothing has been found in the investigation so far, legal action initiated: Delhi Police
— ANI (@ANI) August 2, 2024
Also Read..
Wayanad | 300 దాటిన వయనాడ్ మృతులు.. ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు
Nagarjuna Sagar | 4 గంటలకు సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల..