Hamas Chief | హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా (Ismail Haniyeh) హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇరాన్ రాజధాని టెహ్రాన్ (Tehran)లో అతడి నివాసంపై బుధవారం తెల్లవారక ముందు 2 గంటల సమయంలో జరిగిన వైమానిక దాడిలో హనియా మరణించాడని ఇరాన్ ప్రభుత్వంతోపాటు హమాస్ గ్రూపు కూడా ధ్రువీకరించింది. అయితే, క్షిపణుల దాడిలో హనియా మృతి చెందలేదని తాజాగా తెలిసింది. హనియాని పక్కా ప్లాన్ ప్రకారం బాంబు పేలుడుతో హత్య చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
హత్యకు రెండు నెలల ముందే ప్లాన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలను ఊటంకిస్తూ ది న్యూయార్క్ టైమ్స్ (The New York Times) నివేదించింది. హనియా మరణించిన నివాసం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ (Islamic Revolutionary Guards Corps)కు చెందిన ఓ పెద్ద భవన సముదాయంలో ఉంటుంది. దీన్ని ఐఆర్జీసీ తమ రహస్య సమావేశాలకు, ముఖ్యమైన నేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఉపయోగిస్తుంది. ఇక్కడ నిత్యం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది.
ఈ గెస్ట్‌హౌస్‌కు హనియా వస్తాడని ముందే తెలుసుకున్న ప్రత్యర్థులు.. దాదాపు రెండు నెలల కిందటే ఓ బాంబును రహస్యంగా తీసుకొచ్చి హనియా గదిలో దాచిపెట్టినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అప్పటి నుంచి దుండగులు హనియా కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వచ్చారని పేర్కొంది. ఇక హనియా ఆ గెస్ట్‌హౌస్‌లోని తన గదిలో ఉన్నప్పుడు రిమోట్ కంట్రోల్ ద్వారా బాంబు పేల్చినట్లు తెలిపింది. ఈ దాడిలో హనియా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.
ఇజ్రాయెల్‌పై యుద్ధమే.. ప్రత్యక్ష దాడికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆదేశం
తమ సొంత గడ్డపై హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను హత్య చేయడంపై ఇరాన్ సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు ఇరాన్ సుప్రీమ్ లీడర్ (Iran Supreme Leader) అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) తమ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు గురువారం వార్తలు వచ్చాయి. హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడి చేయాలని ఖమేనీ ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. హనియా మృతి తర్వాత బుధవారం ఇరాన్ భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. ఆ సమావేశంలోనే ఇజ్రాయెల్‌పై దాడి చేయాలని ఖమేనీ ఆదేశాలు ఇచ్చారని ది న్యూయార్క్ టైమ్స్నివేదించింది. కీలక అధికారుల సమాచారాన్ని ఊటంకిస్తూ.. కథనం ప్రచురించింది.
ఇజ్రాయెల్‌పై దాడి చేయాలంటూ ఆ సమావేశంలో ఖమేనీ మిలటరీకి ఆదేశాలు ఇచ్చినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ‘ప్రతీకారం మా విధి. వారి కోసం కఠినమైన శిక్షను సిద్ధం చేశాం’ అని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇరాన్ ఇలాంటి సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఏప్రిల్‌లో సిరియాలో ఇద్దరు ఇరాన్ మిలటరీ కమాండర్లను వైమానిక దాడిలో ఇజ్రాయెల్ హతమార్చినప్పుడు కూడా ఇదే తరహా సమావేశాన్ని నిర్వహించారు.
హమాస్ చీఫ్ హనియా హతం
హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్లో హత్యకు గురయ్యాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై బుధవారం తెల్లవారక ముందు 2 గంటల సమయంలో జరిగిన వైమానిక దాడిలో హనియా మరణించాడని ఇరాన్ ప్రభుత్వంతోపాటు హమాస్ గ్రూపు కూడా ధ్రువీకరించింది. దాడిలో హనియాతోపాటు ఆయన బాడీగార్డు కూడా మరణించాడని తెలిపాయి. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరై, ఇంటికి వచ్చిన తర్వాత ఈ దాడి జరిగినట్టుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. లెబనాన్ రాజధాని బీరుట్లో ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా టాప్ కమాండర్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ మంగళవారం సాయంత్రం ప్రకటించగా.. దానికి కొద్ది గంటల తర్వాతనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
Also Read..
Bomb Threat | ఢిల్లీ పాఠశాలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు
Wayanad | 300 దాటిన వయనాడ్ మృతులు.. ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు
Hamas | హమాస్‌కు మరో ఎదురుదెబ్బ.. మిలిటరీ చీఫ్ మహ్మద్ డెయిఫ్ హతం