Novak Djokovic | సెర్బియా స్టార్, 24 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన నోవాక్ జకోవిచ్ (Novak Djokovic) సెర్బియా (Serbia)ను వీడినట్లు తెలుస్తోంది. ఆయన గ్రీస్ (Greece)కు మకాం మార్చినట్లు సమాచారం. ఇప్పటికే తన ఫ్యామిలీని అక్కడికి షిఫ్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సెర్బియాలో ప్రభుత్వ (Serbian government) అనుకూల వర్గాల నుంచి పెరుగుతున్న ఒత్తిడి కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు కథనాలు వెల్లడిస్తున్నాయి.
మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. గత డిసెంబర్లో నోవి సాడ్‌లోని రైల్వే స్టేషన్లో జరిగిన విషాద సంఘటనతో సెర్బియాలో నిరసనలు చెలరేగాయి. దీని ఫలితంగా దాదాపు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ అవినీతిని నిరసిస్తూ, రాజకీయ సంస్కరణలకు పిలుపునిస్తూ విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. సెర్బియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులకు జకోవిచ్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు.
బెల్గ్రేడ్ బాస్కెట్‌బాల్ గేమ్‌లో ‘స్టూడెంట్స్ ఆర్ ఛాంపియన్స్’ అని ఉన్న స్వెట్టర్‌ను ధరించి మద్దతు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అప్పటి నుంచి అతడిపై ప్రభుత్వం నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చింది. ఈ కారణంతో తన సొంత దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని జకోవిచ్ నిర్ణయించుకున్నట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి.
ఇందులో భాగంగానే గ్రీస్‌కు తన ఫ్యామిలీని షిఫ్ట్ చేసినట్లు తెలిసింది. గ్రీకు రాజధానిలో ఓ ఇంటిని కూడా జకోవిచ్ కొనుగోలు చేసినట్లు సదరు కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఇప్పటికే గ్రీక్ గోల్డెన్ వీసాకు జకోవిచ్ దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఏథెన్స్ (Athens)లోని సెయింట్ లారెన్స్ కాలేజీ (St. Lawrence College)లో తన పిల్లలు స్టెఫాన్, తారా కోసం అడ్మిషన్లు కూడా తీసుకున్నట్లు సమాచారం.
Also Read..
Nepal prison | పారిపోతున్న ఖైదీలపై ఆర్మీ కాల్పులు.. ఆందోళనల మాటున జైళ్ల నుంచి 15 వేల మంది పరార్
Pakistani Diplomat | నకిలీ కరెన్సీ కేసు.. పాకిస్థాన్ దౌత్యవేత్తకి ఎన్ఐఏ సమన్లు
Kamala Harris | ఆయన అహంకారమే ఓటమికి కారణం.. బైడెన్‌పై ధ్వజమెత్తిన కమలా హారిస్