Nepal prison | పారిపోతున్న ఖైదీలపై ఆర్మీ కాల్పులు.. ఆందోళనల మాటున జైళ్ల నుంచి 15 వేల మంది పరార్
Nepal prison | ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన్ జడ్ నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనల మాటున దేశ వ్యాప్తంగా ఉన్న జైళ్ల (Nepal prison) నుంచి ఖైదీలు (inmates) పారిపోయేందుకు ప్రయత్నించారు.
Nepal prison | ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన్ జడ్ నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనల మాటున దేశ వ్యాప్తంగా ఉన్న జైళ్ల (Nepal prison) నుంచి ఖైదీలు (inmates) పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో వారిపై ఆర్మీ కాల్పులు జరిపింది.
గురువారం ఉదయం రామెచాప్ జిల్లా జైలు నుంచి ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించారు. జైలు గేట్లను బద్దలు కొట్టి తప్పించుకునేందుకు యత్నించారు. అప్రమత్తమైన సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 12 మంది గాయపడ్డారు. వారికి వైద్యచికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ జైలులో దాదాపు 300 మందికిపైగా ఖైదీలు ఉన్నారు. ఖైదీలందరినీ అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమాలపై నిషేధం, అవినీతికి వ్యతిరేకంగా జన్-జడ్ నిరసనకారులు (Gen Z protesters) సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిరసనలు చెలరేగినప్పటి నుంచి దేశవ్యాప్తంగా పలు జైళ్ల నుంచి వేలాది మంది ఖైదీలు తప్పించుకున్నారు. కాఠ్మాండూ, పోఖరా, లలిత్‌పుర్‌లోని జైళ్ల నుంచి దాదాపు 15,000 మందికిపైగా ఖైదీలు పారిపోయారు.
బాంకే జువెనైల్ రిఫార్మ్ సెంటర్ నుంచి 122 మంది, బాంకే జిల్లా జైలు నుంచి 436 మంది, కాఠ్మాండూ లోయలోని సుందరలో గల సెంట్రల్ జైలు నుంచి 3,300, లలిత్‌పుర్‌లోని నక్కు జైలు నుంచి 1,400 మంది, దిల్లిబజార్ జైలు నుంచి 1,100 మంది ఉన్నారు. మహోత్తర జలేశ్వర్ జైలు నుంచి 575, సున్సారీలోని ఝుమ్కా జైలు నుంచి 1,575, చిత్వాన్ జైలు నుంచి 700 మంది, కపిల్ వాస్తు జిల్లా జైలు నుంచి 459 మంది, కైలాలి జైలు నుంచి 612 మంది, కాంచన్‌పూర్ జైలు నుంచి 478, సింధులి జైలు నుంచి 500 మంది ఉన్నారు. తప్పించుకున్న ఖైదీలు సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించారు. కొందరు భారత్‌వైపు రాగా.. వారిని భారత సాయుధ పోలీసుదళం సశస్త్ర సీమా బల్ (SSB) పట్టుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ సమీపంలో 22 మంది నేపాలీ ఖైదీలను అడ్డుకున్నట్లు ఎస్ఎస్బీ అధికారులు తెలిపారు.
Also Read..
Nepal: హెలికాప్టర్లకు తాళ్లు కట్టి.. వేలాడుతూ పారిపోయిన మంత్రులు, కుటుంబసభ్యులు.. వీడియో
రాజ్యాంగాన్ని తిరగరాయాలి.. 3 దశాబ్దాల పాలకుల అవినీతిపై దర్యాప్తు చేయాలి!.. జనరేషన్ జెడ్ డిమాండ్లు
Sushila Karki: తాత్కాలిక ప్రభుత్వ చీఫ్‌గా సుశీలా కర్కి పేరును ప్రతిపాదించిన జెన్-జెడ్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

