కాఠ్మాండు : నేపాల్(Nepal)లో ఆందోళనకారుల ధాటికి ఆ దేశ మంత్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిరసనకారుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కష్టాలు ఎదుర్కొన్నారు. ఆర్మీ హెలికాప్టర్ల ద్వార సురక్షి ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నం చేశారు. భారీ ఎత్తున నిరసన చోటుచేసుకున్న సమయంలో.. కొందరు మంత్రులు తమ కుటుంబసభ్యులతో కలిసి పరారీ అయ్యారు. అయితే ఆర్మీ హెలికాప్టర్లకు తాళ్లు కట్టి, వాటికి వేలాడుతూ మంత్రులు, వాళ్ల ఫ్యామిలీ సభ్యులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ఈ ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాను ప్రభుత్వం బ్యాన్ చేయడంతో యువత తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లారు. శాంతి భద్రతల స్థాపన కోసం దేశాన్ని ఆర్మీ తన ఆధీనంలోకి తీసుకున్నది. నేపాలీ వీధుల్లో సైనికులు పహారా కాస్తున్నారు.
WORLD NEWS:
Politicians in Nepal had to hang onto ropes from helicopters to escape from the wrath of the protesters pic.twitter.com/ZSBRADfuio
— African Hub (@AfricanHub_) September 10, 2025
జెన్ జెడ్ నిరసనకారులు అనేక ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పుపెట్టిన విషయం తెలిసిందే. కేంద్ర సమాచారాశాఖ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ ఇంటికి నిప్పుపెట్టారు. డిప్యూటీ ప్రధాని, ఆర్థిక మంత్రి బిష్ణు పౌడేల్ ఇంటిపై రాళ్లు రువ్వారు. మాజీ హోంమంత్రి రమేశ్ లేకక్ ఇంటిపై దాడి చేశారు. నేపాలీ వీధుల్లో ఆర్థిక మంత్రిపై దాడి చేశారు. నేపాల్ విదేశాంగ మంత్రి అర్జూ రాణా దేబా,ఆమె భర్త, మాజీ ప్రధాని, నేపాల్ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేబా ఇండ్లల్లో దాడి జరిగింది. ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నా.. ఆర్మీ హెలికాప్టర్లు మాత్రం కొందరు మంత్రులను, వారి కుటుంబసభ్యులను తరలించింది. హెలికాప్టర్‌కు తాడు కట్టి, దానికి రెస్క్యూ బాస్కెట్ పెట్టి, వాటిల్లో మంత్రులను తరలించారు.
🚨 BREAKING: In response to growing unrest in Nepal, the Nepalese Army deployed a Hindustan ALH Dhruv NA-054 helicopter to transport members of parliament to a safer location. The move comes amid rising tensions and concerns over security. 🇳🇵 #NepalUpdate pic.twitter.com/TuKEoKupn2
— Fahad Naim (@Fahadnaimb) September 9, 2025