Pakistani Diplomat | నకిలీ కరెన్సీ కేసు (fake currency case)కు సంబంధించి పాకిస్థాన్ దౌత్యవేత్త (Pakistani Diplomat) అమీర్ జుబేర్ సిద్దిఖీ (Amir Zubair Siddique)కి తమిళనాడు చెన్నైలోని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 15న కోర్టులో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
ఈ కేసు 2018 నాటిది. నకిలీ ఇండియన్ కరెన్సీ నోట్ల చలామణీ (fake Indian currency case)లో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ వ్యవహారంలో సిద్ధిఖీ సహా మరో ఇద్దరిపై ఎన్ఐఏ చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. సిద్ధిఖీ ప్రస్తుతం శ్రీలంకలో నివసిస్తున్నారు. అక్కడ పాకిస్థాన్ హైకమిషన్‌లో వీసా కౌన్సిలర్‌గా పనిచేస్తున్నారు. 2018లో ఎన్ఐఏ అతడిని వాంటెడ్ జాబితాలో చేర్చింది. అతడిపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది.
Also Read..
Russian Army | రష్యా సైన్యంలో చేరొద్దు.. భారతీయులకు కేంద్రం కీలక సూచన
fire broke out in Train | స్పెషల్ ట్రైన్లో మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు.. VIDEO
Air India | ఎయిర్ ఇండియా విమానంలో పనిచేయని ఏసీ.. 2 గంటల తర్వాత ప్రయాణికులను దించేశారు