Taapsee Pannu | హీరోయిన్లకు ప్రాధాన్యం ఉన్న సినిమాలకు హీరోలు భయపడుతున్నారు: తాప్సీ పన్ను
Taapsee Pannu | బాలీవుడ్లో తనదైన మాటలతో పాటు బలమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సినీ పరిశ్రమలో ఉన్న పురుషాధిక్యతపై ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చకు దారితీస్తున్నాయి.
Taapsee Pannu | బాలీవుడ్లో తనదైన మాటలతో పాటు బలమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సినీ పరిశ్రమలో ఉన్న పురుషాధిక్యతపై ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చకు దారితీస్తున్నాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన తాప్సీ, కథానాయికలకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించేందుకు చాలా మంది హీరోలు వెనకడుగు వేస్తున్నారని వెల్లడించారు. ముఖ్యంగా తాను ఒక సినిమాలో డబుల్ రోల్ చేస్తున్న సమయంలో జరిగిన ఒక అనుభవాన్ని ఆమె పంచుకున్నారు.
ఆ సినిమా కోసం మేకర్స్ ముందుగా ఒక ప్రముఖ స్టార్ హీరోను సంప్రదించారని తాప్సీ చెప్పారు. అయితే కథలో హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తెలుసుకున్న ఆ హీరో, అభద్రతా భావంతో ఆ ప్రాజెక్ట్ను తిరస్కరించాడని ఆమె తెలిపారు. ఆ హీరోతో తాను గతంలో కలిసి పనిచేసినప్పటికీ, కేవలం పాత్ర నిడివితో పాటు ప్రాధాన్యం కారణంగా ఆయన వెనక్కి తగ్గడం తనకు ఆశ్చర్యం కలిగించిందని తాప్సీ పేర్కొన్నారు. అంతేకాకుండా, ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన యువ హీరోలు కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రేక్షకుల ప్రశంసలు హీరోయిన్ పాత్రకే ఎక్కువగా దక్కుతాయనే భావన వారిలో ఉండటంతో ఇలాంటి సినిమాలను చాలా మంది హీరోలు దూరంగా ఉంచుతున్నారని ఆమె అన్నారు.
గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, బలమైన కథలతో కూడిన సినిమాల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన తాప్సీ పన్ను చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. చిత్ర పరిశ్రమలో సమానత్వం, మహిళా పాత్రలకు ప్రాధాన్యం వంటి అంశాలపై ఆమె మాట్లాడటంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ మరోసారి నెట్టింట హాట్ టాపిక్గా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

