IPL 2025 : బోణీ కోసం నిరీక్షిస్తున్న రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ఆదిలో తడబడినా భారీ స్కోర్ చేసింది. గువాహటి వేదికగా నితీశ్ రానా(81: 36 బంతులలో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లపై అర్థ శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ సీజన్లో ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని రానా శనివారం స్వీప్ షాట్లతో రెచ్చిపోయాడు. స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. సంజూ శాంసన్(20)తో 82 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడీ లెఫ్ట్ హ్యాండర్. మిడిలార్డర్ విఫలమైనా.. కెప్టెన్ రియాన్ పరాగ్(37) సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో షిమ్రన్ హిట్మైర్(19) మెరుపులతో ప్రత్యర్థికి రాజస్థాన్ 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
రాజస్థాన్ రాయల్స్‌కు మూడో మ్యాచ్‌లోనూ శుభారంభం దక్కలేదు. గత సీజన్లో రెచ్చిపోయి ఆడిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్(4) తొలి ఓవర్లోనే వికెట్ పారేసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ ఊరిస్తూ వేసిన బంతిని ఆడి అశ్విన్‌కు దొరికిపోయాడు. ఆ తర్వాత సంజూ శాంసన్(16)కు జత కలిసిన నితీశ్ రానా(58) దూకుడుగా ఆడాడు. ఓవర్టన్, ఖలీల్ బౌలింగ్‌లో బౌండరీలు బాదిన రానా.. అశ్విన్ వేసిన తొలి (5వ) ఓవర్లోనే అతడిపై ఎదురుదాడికి దిగాడు. స్క్వేర్ లెగ్ దిశగా స్వీప్ షాట్లు ఆడి వరుసగా 6, 6, 4 బాదేసి 19 పరుగులు పిండుకున్నాడు.
𝐑𝐚𝐦𝐩𝐚𝐧𝐭 𝐑𝐚𝐧𝐚 😎
A beautiful innings of 81(36) comes to an end 👏👏
Nitish Rana thoroughly entertained tonight with his exquisite range of batting 💫
Updates ▶️ https://t.co/V2QijpWpGO#TATAIPL | #RRvCSK | @rajasthanroyals | @NitishRana_27 pic.twitter.com/8k5WrKxMdn
— IndianPremierLeague (@IPL) March 30, 2025
ఆరో ఓవర్లో ఫోర్ బాదిన అతడు 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. త్వరలోనే తండ్రి కాబోతున్న విషయాన్ని తెలియజేస్తూ.. క్రాడిల్ సెలబ్రేషన్ చేసుకున్నాడు హిట్టర్. సంజూ శాంసన్(16)తో కలిసి రెండో వికెట్‌కు 82 పరుగులు జోడించాడు రానా. ప్రమాదకరంగా మారిన ఈ జంటను నూర్ అహ్మద్ విడదీశాడు. శాంసన్ వికెట్ పడిన తర్వాత కెప్టెన్ రియాన్ పరాగ్(37)తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే.. సెంచరీ దిశగా వెళ్తున్న రానాను అశ్విన్ ఔట్ చేశాడు. షిమ్రాన్ హిట్మైర్(19)తో కలిసి ఇన్నింగ్స్ నడిపిస్తున్న పరాగ్‌ను పథిరన క్లీన్ బౌలింగ్‌లో బౌల్డ్ .. అయ్యాడు. దాంతో, ఆరో వికెట్ పడింది. అక్కడితో చెన్నై బౌలర్లు విజృంభించి టెయిలెంటర్లను పెవిలియన్ చేర్చారు. రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగలిగింది. చెన్నై బౌలర్లలో ఖలీల్, నూర్ అహ్మద్, పథిరనలు తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.