Teachers | కీసర, మార్చి 30 : సీఎం రేవంత్‌రెడ్డి ఉపాధ్యాయులను కించ పరిచే విధంగా మాట్లాడటం సిగ్గు చేటుగా ఉందని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షుడు రామినేని వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి లచ్చుమల్ల వెంకన్నలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో విద్యాశాఖ బడ్జెట్‌పై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉపాధ్యాయులను కించ పరిచే విధంగా మాట్లాడటం సరికాదని అన్నారు.
ఉపాధ్యాయులు సంవత్సరంలో కేవలం సగం రోజులే పనిచేస్తున్నారని.. జీతాలు మాత్రం సంవత్సరానికి తీసుకుంటున్నారని అర్థం వచ్చేలా మాట్లాడటం సరికాదన్నారు. మేము కూడా మిగతా ఉద్యోగుల లాగే పనిచేస్తున్నామని.. కేవలం మనో విజ్ఞాన శాస్ర్తం ప్రకారం విద్యార్థులకు సెలవులు ఇస్తారని ఆ సమయంలో కూడా మేము ఎల్లప్పుడు ప్రభుత్వానికి అందుబాటులోనే ఉంటున్నామని తెలిపారు.
మీరు ఒకవేళ పిల్లలకు ఎలాంటి సెలవులు ఇవ్వకుండా బోధన సాగించే విధంగా అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించి ఇస్తే ఆ విధంగా పనిచేయడానికి ఉపాధ్యాయ లోకమంతా సిద్దంగా ఉన్నామన్నారు. మిగతా ఉద్యోగులు మాకంటే 30 రోజులు ఎక్కువగా పనిచేస్తారని.. అందుకు తగ్గట్టుగానే వారికి 30 సంపాదిత సెలవులు కూడా ప్రభుత్వం ఇస్తున్న విషయం ముఖ్యమంత్రికి తెల్వనిది కాదని, విద్యాశాఖను కూడా నాన్ వెకేషన్ శాఖగా మార్చి పిల్లలకు ఎలా బోధన చేయాలో నూతన శిక్షణ కార్యక్రమాలకు ప్రణాళికలను రూపొందించాలని డిమాండ్ చేశారు.
gangula | వృత్తి విద్యా కోర్సులతో బంగారు భవిష్యత్
Collector Rahul Raj | దుర్గామాతను దర్శించుకున్న కలెక్టర్ రాహుల్ రాజ్