జగిత్యాల, మార్చి 16 : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న ది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌తో అంటకాగుతున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో అంతర్గత విభేదాలు రావడం, పార్టీ తీరుపై జీవన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం, సంచలన వ్యాఖ్యలు చేయడం లాంటివి ఆయన పార్టీ మారుతారనే ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. తాజాగా జగిత్యాలలోని ఆయన ఇంటి ముందు కాంగ్రెస్ ఫ్లెక్సీలు తొలగించడం చూస్తే జీవన్‌రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. కొంతకాలంగా సర్కార్‌పై ధిక్కార స్వరం వినిపిస్తున్న జీవన్‌రెడ్డి సోమవారం కలెక్టరేట్ వద్ద రైతుల తో కలిసి మక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేయాలని నిరసన వ్యక్తంచేశారు. రైతు భరోసా ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తర్వాత పార్టీ ఎప్పుడు మారుతారని విలేకరులు అడగ్గా.. తర్వాత చూద్దాం అని దాటవేసినట్టు తెలిసింది. పార్టీ మార్పుపై క్లారి టీ ఇవ్వకపోయినా.. మారుతున్నట్టు సంకేతా లు ఇవ్వడం, పార్టీ మారాల్సిందేనని కార్యకర్తలు పట్టుబట్టగా.. ‘పార్టీ రంగుకు రాం.. రాం’ అంటూ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దీంతో సాయంత్రం కార్యకర్తలంతా కలిసి జీవన్‌రెడ్డి ఇంటి ఎదుట ఉన్న కాంగ్రెస్ జెం డాలు, ఫ్లెక్సీలను తొలగించారు. షయం సో షల్ మీడియాలో వైరల్ కాగా, పార్టీలోనూ చర్చనీయాంశమైంది. వరుస ఎపిసోడ్ల నేపథ్యంలో జీవన్‌రెడ్డి పయనమెటు? అన్న దానిపై ఆసక్తి నెలకొన్నది. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఉదయం జీవన్‌రెడ్డి తో ఫోన్లో మాట్లాడి.. నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. ఘాటుగా స్పందించినట్టు తెలిసిం ది. ‘నలభై ఏండ్ల కాంగ్రెస్ ప్రయాణానికి మీరిచ్చిన బహుమతి ఇదేనా’ అని నిలదీసినట్టు సమాచారం. ఇక కాంగ్రెస్‌తో తన ప్రయాణం చాలంటూ ముగించారని తెలిసింది.