IPL 2025 : టాస్ ఓడిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే షాక్. గత రెండు మ్యాచుల్లో విఫలమైన ఓపెనర్ యశస్వీ జైస్వాల్(4)మళ్లీ నిరాశ పరిచాడు. గువాహటిలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 4 పరుగులకే డగౌట్ చేరాడీ యంగ్‌స్టర్. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఔట్ సైడ్ వచ్చిన బంతిని ఆడి అశ్విన్ చేతికి చిక్కాడు యశస్వీ.
తొలి వికెట్ పడినా లెఫ్ట్ హ్యాండర్ నితీశ్ రానా(58) స్వీప్ షాట్లతో అలరిస్తున్నాడు. బౌండరీతో ఈ సీజన్లో తొలి అర్థ శతకం సాధించిన అతడు క్రాడిల్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. సంజూ శాంసన్(16)లు సైతం ధనాధన్ ఆడుతున్నాడు. పవర్ ప్లేలో రాజస్థాన్ స్కోర్.. 79-1.
వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్‌కు మరోసారి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(4) తొలి ఓవర్లోనే వికెట్ పారేసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ ఊరిస్తూ వేసిన బంతిని ఆడి అశ్విన్‌కు దొరికిపోయాడు. ఆ తర్వాత సంజూ శాంసన్(16)కు జత కలిసిన నితీశ్ రానా(58) దూకుడుగా ఆడుతున్నాడు. ఓవర్టన్, ఖలీల్ బౌలింగ్‌లో బౌండరీలు బాదిన రానా.. అశ్విన్ వేసిన తొలి ఓవర్లోనే అతడిపై ఎదురుదాడికి దిగాడు. స్క్వేర్ లెగ్ దిశగా స్వీప్ షాట్లు ఆడి వరుసగా 6, 6, 4 బాదేసి 19 పరుగులు పిండుకున్నాడు. ఆరో ఓవర్లో ఫోర్ బాది హాఫ్ సెంచరీ సాధించిన అతడు ఆఖరి బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు.