Prabhas | ప్రస్తుతం ప్రభాస్ లైనప్ చాలా పెద్దగానే ఉంది. ఆయన గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తున్నారు. సలార్, కల్కి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టిన ప్రభాస్ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. వాటిలో ది రాజా సాబ్, స్పిరిట్ వంటి చిత్రాలు ఉన్నాయి.గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ది రాజా సాబ్ సమ్మర్లో రిలీజ్ అవుతుంది అని అందరు అనుకున్నారు. కాని ఈ సినిమా కొద్ది రోజులు పోస్ట్ పోన్ అయ్యేలా ఉంది.. కంగారు పడకుండా ధైర్యంగా ఉంటే, ది బెస్ట్ ఔట్పుట్ వస్తుందన్నారు మారుతి. అప్పుడెప్పుడో ఇచ్చిన మ్యూజిక్ పాతదైపోయింది. అందుకే ఫ్రెష్‌గా మళ్లీ ట్యూన్స్ కడుతున్నానన్నారు తమన్. అందుకే వేసవిలో థియేటర్లలోకి రావాల్సిన సినిమా మరి కొద్ది రోజులు పోస్ట్ పోన్ అయ్యేలా కనిపిస్తుంది.
ఇక స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే సినిమా చేయనుండగా, ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో గుడ్ న్యూస్ అందింది. ఓ ఈవెంట్లో మూవీ షూటింగ్‌కు సంబంధించి అప్డేట్ ఇచ్చారు సందీప్ రెడ్డి. యూఎస్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందీప్ రెడ్డిని.. యాంకర్ స్పిరిట్ అప్ డేట్స్ ఇవ్వమని అడగగా, తాను వన్ డే ఈవెంట్ కోసం మెక్సికో వచ్చానని.. తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతానని చెప్పారు. ఇదే బిగ్ అప్ డేట్ అని.. చిత్రీకరణ కోసం మెక్సికోలో కొన్ని ప్రాంతాలు పరిశీలిస్తున్నామని.. అక్కడే షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటున్న ఈ సినిమాని ఈ ఏడాది సమ్మర్లో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.. అర్జున్ రెడ్డి, యానిమల్ మూవీలతో ఫేమస్ అయిన సందీప్ రెడ్డి వంగా .. ప్రభాస్ రేంజ్‌కు అనుగుణంగా మూడు డిఫరెంట్ లుక్స్‌లో చూపించనున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ మూవీస్ తరహాలోనే మాస్ లుక్‌లో ప్రభాస్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఇందులో తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి సందడి చేయనున్నారట ప్రభాస్. ఈ మూవీని టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్.. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత హను రాఘవపూడితో ఓ సినిమా చేయనున్నారు. అలానే సలార్2, కల్కి2 మూవీస్ కూడా ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి.