సిమ్లా: కొండచరియలు విరుగడంతో పెద్ద చెట్టు కూలింది. ఫుడ్ స్టాల్తోపాటు అక్కడ పార్క్ చేసిన వాహనాలపై అది పడింది. ఈ సంఘటనలో ముగ్గురు మహిళలతో సహా ఆరుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. (landslide in Himachal Pradesh) హిమాచల్ ప్రదేశ్లోని కులులో ఈ సంఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం కులులోని గురుద్వారా మణికరణ్ సాహిబ్ ఎదురుగా ఉన్న రోడ్డు వద్ద కొందరు వ్యక్తులు కూర్చొన్నారు.
కాగా, గాలిదుమారం వల్ల కొండచరియలు విరుగడంతో పెద్ద చెట్టు కూలింది. అక్కడున్న ఫుడ్ స్టాల్, కొన్ని వాహనాలపై అది పడింది. దీంతో ఒక వ్యాపారి, కారు డ్రైవర్, ముగ్గురు మహిళలతో సహా నలుగురు పర్యాటకులు మరణించారు. మరి కొందరు గాయపడ్డారు.
మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను కూడా ఆసుపత్రికి తరలించారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Another Video 3 women were among the six people who died after a landslide near the PWD road opposite Gurdwara Manikaran Sahib in Himachal Pradesh’s Kullu on Sunday evening. Three others were injured in the incident.#Manikaran #Kullu #HimachalPradesh #Landslide pic.twitter.com/GicBydFGyD
— Siraj Noorani (@sirajnoorani) March 30, 2025