Hardik Pandya | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12లక్షల జరిమానా విధించారు. శనివారం నరేంద్ర మోదీ స్టేడియంలో టైటాన్స్ చేతిలో ముంబయి ఇండియన్ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్లో హార్దిక్ ఆడిన తొలి మ్యాచ్ ఇదే. స్లో ఓవర్ రేట్ కారణంగా గత సీజన్ చివరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్‌కు ఒక మ్యాచ్‌లో ఆడకుండా నిషేధం విధించిన విషయం తెలిసిందే. దాంతో ఈ ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ముంబయి బరిలోకి దిగి.. సీఎస్కే చేతిలో పరాజయం పాలైంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌కు పాండ్యా మళ్లీ జట్టుతో చేరి బాధ్యతలు తీసుకున్నాడు.
ఇదిలా ఉండగా.. సీజన్‌కు ముందు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కెప్టెన్లతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఒక మ్యాచ్ బ్యాన్‌ను నిషేధించారు. కెప్టెన్లకు డీమెరిట్ పాయింట్లతో పాటు స్లో ఓవర్ రేట్‌కు కేవలం జరిమానా మాత్రమే విధించేందుకు అంగీకారం కుదిరింది. తాజా మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం జరిమానా విధించారు. గుజరాత్-ముంబయి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ మొదట నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేసింది. ఆ తర్వాత 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబయి ఆరు వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో కేవలం 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. సాయి సుదర్శన్ అర్ధ సెంచరీ, బౌలర్ల అద్భుతమైన ప్రదర్శనతో ముంబయి ఇండియన్స్‌ను 36 పరుగుల తేడాతో ఓడించింది. ఈ సీజన్లో గుజరాత్‌కు ఇదే తొలి విజయం. రెండు మ్యాచ్‌ల్లో ముంబయికి ఇది రెండో ఓటమి.