Peddashankaram Pet | పెద్దశంకరంపేట, మార్చి 30 : తెలంగాణ గ్రూప్-1 రాష్ట్రస్థాయి పరీక్షా ఫలితాల్లో పెద్దశంకరంపేట మండలం మూసాపేట గ్రామానికి చెందిన ఎరగారి ప్రభాత్‌రెడ్డి అనే యువకుడు రాష్ట్ర స్థాయిలో 73వ ర్యాంకు సాధించాడు.
మూసాపేటకు చెందిన శశింధర్రెడ్డి-పావనిలకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు ప్రభాత్‌రెడ్డి గత రెండు నెలల కిత్రం వెల్లడైన గ్రూప్ 4లో ఉత్తమ ప్రతిభ సాధించి ప్రస్తుతం మెదక్ జిల్లా కొల్చారంలో రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. దీంతోపాటు గ్రూప్ 3లో కూడా 800 ర్యాంకు పాధించాడు. ఈ సందర్భంగా అతడిని గ్రామస్థులు, కుటుంబసభ్యులు, బంధువులు అభినందించారు.
gangula | వృత్తి విద్యా కోర్సులతో బంగారు భవిష్యత్
Collector Rahul Raj | దుర్గామాతను దర్శించుకున్న కలెక్టర్ రాహుల్ రాజ్