IND vs ENG : లార్డ్స్ టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (2-7) ఇంగ్లండ్‌కు పెద్ద షాకిచ్చాడు. తొలి సెషన్లో ప్రధాన పేసర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్లను పెవిలియన్ పంపాడు. గేర్ మార్చి బౌండరీలతో చెలరేగాలనుకున్న బెన్ డకెట్(23), జాక్ క్రాలే(18)లను ఒకే ఓవర్లో ఔట్ చేసి ఆతిథ్య జట్టుకు ఊహించని ఝలక్ ఇచ్చాడీ ఆల్‌రౌండర్. ప్రస్తుతం జో రూట్(12), ఓలీ పోప్(1)లు ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతానికి స్కోర్.. 56/2.
England handled Bumrah, Siraj & Akashdeep with class…
But Nitish Kumar Reddy was the plot twist they didn’t prepare for.#INDvsENG pic.twitter.com/rMIr4HcTy9— Shalu Kanwar (@ShaluKanwar07) July 10, 2025
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు బెన్ డకెట్(23), జాక్ క్రాలే(18)లు మంచి ఆరంభమిచ్చారు. కొత్త బంతితో బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్‌లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. ఈ ద్వయం మరింత జాగ్రత్తగా ఆడుతూ విసిగించింది. జిడ్డులా క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేస్తున్న ఈ జోడీని విడదీసేందుకు కెప్టెన్ గిల్ బంతిని నితీశ్ కుమార్ చేతికిచ్చాడు. మొదట డకెట్‌ను వెనక్కి పంపిన నితీశ్.. చివరి బంతికి క్రాలేను డగౌట్ చేర్చాడు. ఈ ఇద్దరూ వికెట్ కీపర్ పంత్ చేతికే దొరికిపోయారు. దాంతో, 44 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయింది.
Caught behind x TWO 😎
Nitish Kumar Reddy gets both the England openers 💪
England 44/2 after 14 overs
Updates ▶️ https://t.co/X4xIDiSmBg#TeamIndia | #ENGvIND | @NKReddy07 pic.twitter.com/Pu5UDegYlU
— BCCI (@BCCI) July 10, 2025
ఇవి కూడా చదవండి