KTR | భారతదేశ చిత్రపటం నుంచి తెలంగాణ తొలగింపు.. బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్
KTR | ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మాధవ్, ఏపీ మంత్రి లోకేశ్‌కు ఇచ్చిన భారత చిత్రపటంలో తెలంగాణ లేకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
KTR | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మాధవ్, ఏపీ మంత్రి లోకేశ్‌కు ఇచ్చిన భారత చిత్రపటంలో తెలంగాణ లేకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతదేశ చిత్రపటం నుంచి తెలంగాణను తొలగించడంపై వెంటనే బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తెలంగాణ అస్తిత్వాన్ని భౌగోళిక గుర్తింపుని గుర్తించకపోవడం బిజెపి అధికారిక విధానమా..? అని ప్రధాని నరేంద్ర మోదీని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంలో నరేంద్ర మోదీకి పలు ప్రశ్నలు సంధించారు కేటీఆర్. దశాబ్దాలపాటు తెలంగాణ సాంస్కృతిక గుర్తింపు కోసం, చరిత్రలో తమకు సరైన చోటు దక్కడం కోసం, ప్రత్యేక భౌగోళిక గుర్తింపు, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎనలేని పోరాటాలు చేసింది తెలంగాణ గడ్డ అని కేటీఆర్ పేర్కొన్నారు.
అయితే మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మా సాంస్కృతిక గుర్తింపుని అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేసేలా భారతదేశ చిత్రపటాన్ని ఉపయోగించారు. అయితే, మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మాధవ్ బహుమతిగా ఇచ్చిన మ్యాపులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని మాత్రమే చూపించడం దారుణం. తెలంగాణ రాష్ట్రం అస్తిత్వాన్ని లెక్కచేయకుండా చేసిన చర్య మమ్మల్ని తీవ్రంగా బాధించింది. ఇది పూర్తిగా అనుచితమైంది. భారతదేశ చిత్రపటం నుంచి మా చరిత్రనే తొలగిస్తే మేమెవరం? ఇది మీ పార్టీ అధికారిక అభిప్రాయమా? అని ప్రధానమంత్రి మోదీని కేటీఆర్ ప్రశ్నించారు. లేదా ఈ చర్య కేవలం ఒక పొరపాటా అనే విషయంపై మీరు వెంటనే ప్రధాని మోదీ స్పష్టత ఇవ్వాలి. ఇది తెలంగాణ ప్రజల త్యాగాలు, రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలను, బలిదానాలను అగౌరవపరచడమే కాకుండా మా చరిత్రను నిర్లక్ష్యం చేసిన బిజెపి నేతలు క్షమాపణ చెప్పాలి. పొరపాటైతే, తెలంగాణ ప్రజలని అపహాస్యం చేసినందుకు మీ పార్టీ నాయకత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Honourable PM @narendramodi ji,
We have fought for generations for our cultural identity, our rightful place in history, and our geographical position – TELANGANA
Today, your Andhra Pradesh state BJP chief; Madhav Garu, has belittled our struggle by gifting a United Andhra… pic.twitter.com/vbFi2t1g2i
— KTR (@KTRBRS) July 10, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

