లండన్: లార్డ్స్ మైదానంలో ఉన్న ఎంసీసీ మ్యూజియంలో ఇవాళ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఇంగ్లండ్, ఇండియా మధ్య మూడో టెస్టు జరుగుతున్న నేపథ్యంలో సచిన్ చిత్రపటాన్ని ప్రదర్శించారు. స్టువర్ట్ పియర్సన్ రైట్ ఈ చిత్రపటాన్ని వేశారు. 18 ఏళ్ల క్రితం తీసుకున్న ఓ ఫోటో ఆధారంగా ఆయిల్ పేయింట్స్‌తో దీన్ని వేశారు. ఈ ఏడాది చివరి వరకు మ్యూజియంలో సచిన్ చిత్రపటం ఉంటుంది. ఆ తర్వాత దీన్ని పెవలియన్‌కు మార్చనున్నారు. గతంలో భారత మేటి క్రికెటర్లు కపిల్‌దేవ్, బిషన్ సింగ్ బేడీ, దిలీప్ వెంగ్‌సర్కర్ల పోట్రేట్లను కూడా పియర్సన్ వేశాడు.
లార్డ్స్‌లో తన చిత్రపటాన్ని ఉంచడం గౌరవంగా భావిస్తున్నట్లు టెండూల్కర్ చెప్పాడు. 1983లో కపిల్‌దేవ్ వరల్డ్‌కప్ గెలిచిన సమయంలో.. తొలిసారి లార్డ్స్ స్టేడియాన్ని చూశానని, ఆ సందర్భం తన కండ్లల్లో ఉండిపోయిందని, ఇప్పుడు తన చిత్రపటం లార్డ్స్‌లో ప్రదర్శించడం .. తన క్రికెట్ కెరీర్‌ను గుర్తుకు తెస్తున్నట్లు సచిన్ తెలిపాడు. ఎంసీసీ క్లబ్లో ప్రస్తుతం మూడువేల ఫోటోలు ఉన్నాయి. దాంట్లో 300 వరకు పోట్రేట్లు ఉన్నాయి.
I first visited Lord’s as a teenager in 1988, and returned in 1989 with the Star Cricket Club team.
I remember standing near the pavilion, soaking in the history and dreaming quietly.
Today, to have my portrait unveiled at this very place is a feeling that’s hard to put into… pic.twitter.com/ZC987eH8oZ
— Sachin Tendulkar (@sachin_rt) July 10, 2025