SL vs BAN : స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక (Srilanka) ధీటుగా బదులిస్తోంది. ఓపెనర్ పథుమ్ నిశాంక (187) సూపర్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. గాలే మైదానంలో బంగ్లా బౌలర్లను ఉతికేసిన నిశాంక అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేయగా.. దినేశ్ చండీమాల్(54) అర్ధ శతకంతో రాణించాడు. అయితే.. మ్యాచ్‌తో వీడ్కోలు పలకనున్న ఏంజెలో మాథ్యూస్(39) నిరాశపరిచాడు. రెండో సెషన్ తర్వాత పుంజుకున్న ప్రత్యర్థి బౌలర్లు చకచకా వికెట్లు తీసి లంకను ఒత్తిడిలోకి నెట్టారు.
కానీ, ఆఖరి సెషన్లో కమిందు మెండిస్(37 నాటౌట్), కెప్టెన్ ధనుంజయ డిసిల్వా(17 నాటౌట్)లు మరో వికెట్ పడనీయలేదు. దాంతో, మూడోరోజు ఆట ముగిసే సరికి శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 368 రన్స్ కొట్టింది. ఇంకా పరుగులు 127 వెనకబడి ఉంది ఆతిథ్య జట్టు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్ (WTC 2025-27)లో శ్రీలంక, బంగ్లాదేశ్‌లు హోరాహోరీగా తలపడుతున్నాయి. గాలే మైదానంలో రెండు రోజులు బంగ్లాదేశ్ బ్యాటర్లు పరుగుల వరద పారించిన పిచ్ మీద గురువారం శ్రీలంక బ్యాటర్లు రెచ్చిపోయారు. ఓపెనర్ పథుమ్ నిశాంక(187) విధ్వంసక సెంచరీతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.
First home century for Pathum Nissanka! 🙌 What a performance to bring up his 3rd Test Hundred. Keep it going, Pathum! #SLvBAN #GalleTest pic.twitter.com/DT78FrJ8da
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 19, 2025
తొలి సెషన్లోనే తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో లహిరు ఉదారా(29) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగినా.. తన మార్క్ షాట్లతో అలరించాడీ ఓపెనర్. 23 ఫోర్లు, ఒక సిక్సర్‌తో చెలరేగిన నిశాంక.. దినేశ్ చండీమాల్తో కలిసి రెండో వికెట్‌కు రెండొందలకు పైగా భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని విడదీసిన నయీం హసన్ బంగ్లాకు బ్రేకిచ్చాడు. కెరియర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఏంజెలో మాథ్యూస్(39) ఉన్నంత సేపు అలరించాడు.
క్రీజులో కుదురుకున్న అతడిని టీ సెషన్ తర్వాత మొమినుల్ ఔట్ చేయడంతో 293 వద్ద లంక మూడో వికెట్ పడింది. కాసేపటికే జట్టు స్కోర్ మూడొందలు దాటించిన నిశాంక కూడా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కమిందు మెండిస్(37 నాటౌట్), కెప్టెన్ ధనుంజయ డిసిల్వా(17 నాటౌట్)లు బంగ్లా బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ మరో వికెట్ పడనివ్వలేదు. దాంతో, ఆతిథ్య జట్టు మూడో రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 368 పరుగులు చేయగలిగింది.
End of day three, who’s got the edge? 🏏
SCORECARD: https://t.co/3H5MpjddKE | #SLvBAN pic.twitter.com/b2XiMa1htC
— ESPNcricinfo (@ESPNcricinfo) June 19, 2025
తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేసింది. టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్ జోరుతో
495 పరుగులకు ఆలౌట్ అయింది. లంక బౌలర్లను ఎడాపెడా ఉతికేసిన కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(148), సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీం(163)లు శతకాలతో కదం తొక్కి జట్టుకు కొండంత స్కోర్ అందించారు. లంక బౌలర్లలో అసిథా ఫెర్నాండో నాలుగు వికెట్లతో రాణించగా.. రత్ననాయకే, తరిందు రత్ననాయకే తలామూడేసి వికెట్లు పడగొట్టారు.