Sachin – Anderson Trophy : భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సమరానికి రేపటితో తెరలేవనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సైకిల్లో భాగంగా ఇరుజట్లు లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల దిగ్గజాలు సచిన్ -అండర్సన్ (Sachin – Anderson Trophy) ట్రోఫీని ఆవిష్కరించారు. తమ పేరుతో తొలిసారి నిర్వహిస్తున్న ఈ ట్రోఫీ ఆవిష్కరణలో పాల్గొన్న ఇద్దరూ చిరునవ్వులు చిందించారు.
షెడ్యూల్ ప్రకారం లార్డ్స్ మైదానంలో డబ్ల్యూటీసీ (WTC 2023-25) ఫైనల్ సమయంలోనే ట్రోఫీ పరిచయ కార్యక్రమం నిర్వహించాలనుకున్నారు. అయితే.. అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) జరగడంతో ఆ కార్యక్రమాన్ని ఈసీబీ వాయిదా వేసింది. అనంతరం బీసీసీఐ అంగీకారంతో గురువారం ఇంగ్లండ్ బోర్డు సచిన్ – అండర్సన్ ట్రోఫీని ఆవిష్కరించింది.
Two cricketing icons. One special recognition 🤝
The legendary Sachin Tendulkar and James Anderson pose alongside the new 𝘼𝙣𝙙𝙚𝙧𝙨𝙤𝙣-𝙏𝙚𝙣𝙙𝙪𝙡𝙠𝙖𝙧 𝙏𝙧𝙤𝙥𝙝𝙮 🏆#TeamIndia | #ENGvIND | @sachin_rt | @jimmy9 pic.twitter.com/4lDCFTud21
— BCCI (@BCCI) June 19, 2025
‘ఈ ఏడాది నుంచి భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌ను పటౌడీ పేరుతో కాకుండా సచిన్ – అండర్సన్ ట్రోఫీగా నిర్వహించాలని ఈసీబీ నిర్ణయించింది. అయితే.. అలా చేయడం దిగ్గజ ఆటగాడైన పటౌడీని అగౌరపరచడమేనంటూ పలువురు భారత క్రికెటర్లు మండిపడ్డారు. తన పేరుతో ట్రోఫీ జరపాలనుకుంటున్న ఈసీబీకి టెండూల్కర్ ప్రత్యేక విన్నపం చేశాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇరుదేశాల సిరీస్‌లో పటౌడీ పేరు ఉండేలా చూడాలని కోరాడు. దాంతో, సానుకూలంగా స్పందించిన ఈసీబీ.. విన్నింగ్ కెప్టెన్‌కు ‘పటౌడీ మెడల్’ (Pataudi Medal)ను కానుకగా ఇస్తామని తెలిపింది’ అని మంగళవారం బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.
సచిన్ -అండర్సన్ ట్రోఫీ
భారత్, ఇంగ్లండ్‌ల మధ్య తొలి టెస్టు సిరీస్‌కు 2007లో 75 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఇరుదేశాల బోర్డులు ఇంగ్లండ్‌లో జరుగబోయే సిరీస్‌ను మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ పేరుతో నిర్వహించాలని నిర్ణయించాయి. అప్పటినుంచి 2024 వరకూ పటౌడీ పేరుతోనే ట్రోఫీని జరిపారు. అయితే.. నిరుడు జేమ్స్ అండర్సన్ వీడ్కోలు పలకడంతో అతడిని గౌరవించాలనుకుంది ఈసీబీ. అందుకే.. పటౌడీ ట్రోఫీకి మంగళం పాడి.. భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరును జతచేసింది. ఈ ఏడాది నుంచి సచిన్ – అండర్సన్ ట్రోఫీ నిర్వహిస్తామని ఇంగ్లండ్ బోర్డు తెలిపిన విషయం తెలిసిందే.