Facebook | ఫేస్బుక్లో ఇక వీడియోలన్నీ రీల్స్ ఫార్మాట్లోనే..! ప్రకటించిన మెటా కంపెనీ..!
Facebook | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్ వీడియో షేరింగ్ విధానంలో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఫేస్‌బుక్‌లపై అప్లోడ్ చేయనున్న వీడియోలన్నీ ఇకపై రీల్స్ ఫార్మాట్లో మాత్రమే అప్డేట్ అవుతాయని ప్రకటించింది.
Facebook | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్ వీడియో షేరింగ్ విధానంలో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఫేస్‌బుక్‌లపై అప్లోడ్ చేయనున్న వీడియోలన్నీ ఇకపై రీల్స్ ఫార్మాట్లో మాత్రమే అప్డేట్ అవుతాయని ప్రకటించింది. చిన్న వీడియో అయినా, లెన్త్ వీడియో అయినా రీల్స్ ఫార్మాట్లోనే పబ్లిష్ అవుతాయని స్పష్టం చేసింది. యూజర్లు వీడియో కంటెంట్‌ను ఎలా సృష్టించాలో.. చూసే విధానాన్ని పూర్తిగా మార్చే దిశలో ఈ మార్పు చేసింది. ప్రస్తుతం యూజర్లు వీడియోను రీల్‌గా పోస్ట్ చేయాలనుకుంటున్నారా? సాధారణ వీడియో పోస్ట్‌గా చేయాలనుకుంటున్నారా? అని నిర్ణయించుకునే అవకాశం ఉంది. రెండింటికీ వేర్వేరు ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయి. కానీ, ప్రస్తుతం మెటా నిర్ణయం తర్వాత రీల్స్.. సాధారణ వీడియో పోస్ట్ మధ్య తేడా ముగియనున్నది. ఇకపై వీడియోలన్నీ స్పెషల్ సిస్టమ్ ద్వారా నిర్వహిస్తారు. ఇందులో రీల్ వ్యవధి, ఫార్మాట్లపై పరిమితులు తొలగించనున్నారు.
ఇప్పటి వరకు ఫేస్బుక్లో రీల్స్ నిలువగా.. తక్కువ వ్యవధి మాత్రమే ఉండేది. ఇకపై లాంగ్ లెన్త్ వీడియోలు సైతం అప్లోడ్ చేసే వీలు కలుగనున్నది. దాంతో పాటు గోప్యతా సెట్టింగ్స్, పబ్లిషింగ్ కంట్రోల్స్ సైతం మార్పులుంటాయని తెలిపింది. ఫీడ్, రీల్స్ రెండింటికీ ఆడియన్స్ సెట్టింగ్స్ ఒకేలా ఉంటాయని.. యూజర్లు ఎంచుకున్న ప్రైవసీ సెట్టింగ్స్ అన్ని వీడియో కంటెంట్‌కు వర్తిస్తాయని మెటా కంపెనీ పేర్కొంటున్నది. ఈ కొత్త సిస్టమ్ అమలులోకి వచ్చిన తర్వాత.. యూజర్లు తమ ప్రైవసీ సెట్టింగ్స్‌ను సమీక్షించుకోవాలని.. అవసరమైన మార్పులు చేసుకోవాలనే నోటిఫికేషన్ వస్తుందని.. ఈ సమయంలోనే సమీక్షించుకొని.. అవసరమైన మార్పులు చేసుకోవాలని సూచించింది. దాంతో వీడియోలు చూపించాలనుకుంటున్న ఆడియన్స్‌కు మాత్రమే చేరుతాయని.. అది ఫ్రెండ్స్ అయినా.. ఏదైనా గ్రూప్ అయినా.. జనరల్ ఆడియన్స్ అయినా అని చెప్పింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Meta
- reels
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 5కు చిరంజీవి గెస్ట్ .. మెగా వర్స్ వర్సెస్ అన్‌స్టాపబుల్‌పై ఆసక్తికర చర్చ!
Sabarimala Lord Ayyappa Temple | శబరిమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి భారీ క్యూ లైన్లు.. వీడియో
Suriya | ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో రూ.200 కోట్ల క్లబ్.. ‘సీన్’ సక్సెస్‌పై సూర్య ఎమోషనల్ వీడియో!
Ind vs Nz | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ పరుగుల విధ్వంసం.. 9 వికెట్లు సాధిస్తే టీమిండియాదే గెలుపు
Ajay Devgn | ఓటీటీలోకి అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’.. స్ట్రీమింగ్ తేదీ అధికారిక ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

