FIH Hockey World Cup : ఈ ఏడాది మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న భారత్.. పురుషుల ఎఫ్ఐహెచ్ హాకీ జూనియర్ వరల్డ్ కప్ (FIH Hockey World Cup) పోటీలను కూడా నిర్వహించనుంది. ఈసారి జరుగబోయే14 వ ఎడిషన్ హక్కులను తమిళనాడు దక్కించుకుంది. 2016లో లక్నో, 2021లో భువనేశ్వర్ నగరాల్లో వరల్డ్ కప్ పోటీలు విజయవంతం అయినందున తమ రాష్ట్రంలోనూ ఘనంగా నిర్వహిచేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) గురువారం వరల్డ్ కప్ లోగోను ఆవిష్కరించారు.
నవంబర్ 28 నుంచి డిసెంబర్10 వరకూ టోర్నీ జరగనుంది. చెన్నై, మధురై వేదికలుగా జరుగనున్న ఈ వరల్డ్ కప్‌లో టైటిల్ కోసం 24 జట్లు పోటీపడనున్నాయి. గత సీజన్‌తో పోల్చితే 8 జట్లు అదనంగా వరల్డ్ కప్ రేసులోకి దూసుకొచ్చాయి. అయితే.. వరల్డ్ కప్ డ్రాలను జూన్ 24న స్విట్జర్లాండ్‌లోని లాసానేలో ప్రకటిస్తారని హాకీ ఇండియా జనరల్ సెక్రటరీ తెలిపారు. ఒక్కో గ్రూప్‌లో ఆరు జట్లు ఉంటాయి.
🚨Yet another major Int’l Tournament in TN! Hockey India on Thursday signed MoU with TN Govt to co-host the FIH Men’s Junior World Cup in Chennai and Madurai from Nov 28 to Dec 10 this year. 65 Crs has been allotted for the same!! #TN #Hockey 🏑🏟️ pic.twitter.com/Qlio3zTPIk
— Chennai Updates (@UpdatesChennai) June 19, 2025
లోగో ఆవిష్కరణ అనంతరం ఉదయనిధి మాట్లాడుతూ.. 14వ సీజన్ పురుషుల హాకీ జూనియర్ వరల్డ్ కప్ కోసం ముఖ్యమంత్రి స్టాలిన్ రూ.65 కోట్లు నిధులు మంజూరు చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోళానాథ్ సింగ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.