Harish Rao | హైదరాబాద్ : నల్లమల్ల పులి బిడ్డ కాదు.. వెకిలిమాటల వెర్రిబిడ్డ తేలిపోయింది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్ రెడ్డికి విషయం తక్కువ.. విషం ఎక్కువ అనేది నిన్నటి మాటలతో తేలిపోయిందన్నారు హరీశ్‌రావు. ఇవాళ హరీశ్‌రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
బూతులు తెలుసుకున్నంత సులువు కాదు.. బేసిన్ల గురించి తెలుసుకోవడం. అజ్ఞానం బయట పెట్టుకుని రాష్ట్ర ముందు పరువు తీసుకున్నావ్. ఆయన సలహాదారుడు ఆదిత్యా దాస్ బనకచర్ల ప్రకాశం జిల్లాలో ఉంది అంటాడు. అది ఉన్నది నంద్యాల జిల్లాల్లో. ముఖ్యమంత్రి అట్లంటే ఆయన సలహాదారుడు అంతకంటే గొప్ప ఘనుడుగా ఉన్నాడని మండిపడ్డారు.
మాట్లాడితే నల్లమల్ల బిడ్డ అంటాడు. తొక్కుకుంటా వచ్చిన అంటడు. నల్లమల్ల తెలంగాణ కిందికి వస్తదా ఆంధ్రా కిందికి వస్తదా అంటాడు. నల్లమల్ల బిడ్డ కాదు వెకిలి మాటల వెర్రిబిడ్డ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిలో విషయం తక్కువ విషం ఎక్కువ. బనకచర్ల విషయంలో మొద్దునిద్ర లేపింది బిఆర్ఎస్ పార్టీ. నేను రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టి వాయిస్తే పాత డేట్లు వేసి ఉత్తరాలు విడుదల చేశారు అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
నల్లమల పులిబిడ్డ కాదు..
వెకిలిమాటల వెర్రి బిడ్డ అని తేలిపోయింది.రేవంత్ రెడ్డికి విషయం తక్కువ..
విషం ఎక్కువ!– మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish 🔥 pic.twitter.com/OS1MQ4oktl
— BRS Party (@BRSparty) June 19, 2025