Paris Olympics : భారత యువ బాక్సర్ నిషాంత్ దేవ్(Nishant Dev) ప్రతిష్ఠాత్మక ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics) బెర్తు సాధించాడు. 71 కిలోల విభాగంలో విశ్వ క్రీడలకు అర్హత సాధించాడు. శుక్రవారం బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ క్వాలిఫయర్స్(World Boxing Qualifiers)లో నిషాంత్ తన పంచ్ పవర్ చూపించాడు.
టోర్నీ ఆసాంతం ఇరగదీసిన నిషాంత్ క్వార్టర్ ఫైనల్లో మొల్డోవా బాక్సర్ వెసిలే సెబొటరీ (Vesile Cebotari)కి ముచ్చెమటలు పట్టించాడు. మ్యాచ్ ఆసాంతం పంచ్‌ల వర్షం కురిపించిన నిశాంత్ 5-0తో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాడు. తద్వారా ఒలింపిక్స్ బెర్తు ఖాయం చేసకున్నాడు.
𝐍𝐢𝐬𝐡𝐚𝐧𝐭 𝐃𝐞𝐯 𝐛𝐞𝐜𝐨𝐦𝐞𝐬 𝐭𝐡𝐞 1️⃣st 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐦𝐚𝐥𝐞 𝐛𝐨𝐱𝐞𝐫 𝐭𝐨 𝐰𝐢𝐧 𝐏𝐚𝐫𝐢𝐬 𝐎𝐥𝐲𝐦𝐩𝐢𝐜𝐬 𝐐𝐮𝐨𝐭𝐚.💥💥
He took an easy 5️⃣-0 win over Moldovan Boxer Vasile Cebotari in Men’s 71 Kg category at 2nd Boxing World Olympic Qualifiers. 🙌🥊… pic.twitter.com/RqvnAjlFyA
— The Bridge (@the_bridge_in) May 31, 2024
ప్యారిస్ బెర్దు సాధించిన భారత నాలుగో బాక్సర్‌గా, తొలి పురుష బాక్సర్‌గా నిశాంత్ రికార్డు సృష్టించాడు. అతడి కంటే ముందు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్(50 కిలోలు), ఈశాన్య రాష్ట్రానికి చెందిన లొవ్లినా బొర్గొహెన్(75 కిలోలు), ప్రీతి పవార్(54 కిలోలు)లు విశ్వ క్రీడల బెర్తు దక్కించుకున్నారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో మెరిసిన నిశాంత్.. ఒలింపిక్స్‌లోనూ పతకం గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు. జూలై 1వ తేదీ నుంచి ప్యారిస్ వేదికగా ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి.
“Hanumanji ki Jai” 🙏
Hard work + Faith = Success 💪
Proud of you @nishantdevjr 👊#PunchMeinHaiDum#2ndOlympicBoxingQualifiers#Boxing pic.twitter.com/dSwbSfunyw
— Boxing Federation (@BFI_official) May 31, 2024