ఖమ్మం రూరల్, జనవరి 07 : సంక్రాతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం పరిసర ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నేటి నుండి ఈ నెల జనవరి 20వ తేదీ వరకు నగరంలోని కాల్వవోడ్డు మున్నేరు పాత వంతెనపై కార్లు, ఆటోల రాకపోకలకు తాత్కాలికంగా అనుమతిస్తున్నట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఖమ్మంలో కేవలం బైపాస్ బ్రిడ్జ్ మీద ఎక్కువ ట్రాఫిక్ వెళ్లడం వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో కాల్వవొడ్డు మున్నేరు పాత బ్రిడ్జ్ పై నుండి ఆటోలు, కార్లను కూడా అనుమతించడం జరుగుతుందని, కావునా ప్రజలందరూ గమనించగలరన్నారు. కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్ కోసం రెండు వైపులా తవ్వి ఉన్నందున ప్రజలు ఇరుకు మార్గంలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణించాలని ఆయన సూచించారు.