BCCI : భారత మహిళల క్రికెట్ జట్టు త్వరలోనే సొంత గడ్డపై మరో సిరీస్ ఆడనుంది. రెండు నెలల క్రితం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలపై టెస్టు సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించిన భారత్ ఈసారి దక్షిణాఫ్రికా(South Africa)తో అమీతుమీ తేల్చుకోనుంది. మూడు ఫార్మాట్ల ఈ సిరీస్ కోసం శుక్రవారం బీసీసీఐ 16 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది.
స్టార్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) కెప్టెన్‌గా ఎంపికవ్వగా.. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. టీమిండియా, సఫారీ జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లతో పాటు ఏకైక టెస్టు మ్యాచ్‌లో తలపడనున్నాయి. జూన్ 16న బెంగళూరులో జరుగనున్న తొలి వన్డేతో సిరీస్ ఆరంభం కానుంది. ఈమధ్యే ఆస్ట్రేలియాపై సూపర్ విక్టరీ కొట్టిన దక్షిణాఫ్రికా ఆతిథ్య జట్టుకు గట్టి పోటీనివ్వడం ఖాయం.
వన్డే బృందం : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రీచా ఘోష్(వికెట్ కీపర్), ఉమా చెత్రీ(వికెట్ కీపర్), దయలాన్ హేమలత, రాధా యాదవ్, అశా శోభన, శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్, అరుంధతి రెడ్డి, ప్రియా పూనియా.
టీ20 బృందం : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దయాలన్ హేమలత, ఉమా ఛెత్రి(వికెట్ కీపర్), రీచా ఘోష్(వికెట్ కీపర్), జెమీమా రోడ్రిగ్స్, సంజన సజీవన్, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, అమన్‌జోత్ కౌర్, అశా శోభన, పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్, అరుంధతి రెడ్డి.
టెస్టు స్క్వాడ్ : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, సుభా సతీశ్, జెమీమా రోడ్రిగ్స్, రీచా ఘోష్(వికెట్ కీపర్), ఉమా చెత్రీ(వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ్ రానా, సైకా ఇషాక్, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, మేఘనా సింగ్, ప్రయా పూనియా.