రాజాపేట : బంజారాలలో జ్ఞానజ్యోతిని వెలిగించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు, ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ ( Sant Sevalal ) మహారాజ్ అని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ( Sunita Mahender Reddy ) అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా రాజాపేట మండలంలోని పుట్టగూడంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ కి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె మాట్లాడారు. ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. బంజారాల సంస్కృతికి ఆధ్యాత్మికతను జోడిస్తూ, దేశమంతా సంచరిస్తూ, హితబోధ చేశారన్నారు. దేశమంతా ఛిన్నాభిన్నంగా ఉన్న బంజారా సమాజాన్ని సేవాలాల్ ఏకం చేశారన్నారు.
బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేసిన మహానీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేష్, మదర్ డైరీ డైరెక్టర్ సంధిల భాస్కర్ గౌడ్, ఆలేరు ఏఎంసీ మాజీ డైరెక్టర్ గుర్రం నరసింహులు, నాయకులు రాములు నాయక్, లక్ష్మణ్ నాయక్, దేవులా నాయక్, రాణి, గన్యా, శ్రీనునాయక్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.