రాయపోల్ : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి, రాయపోల్ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ వాలీబాల్ ( Volley Ball ) క్రీడలకు ఎంపికైనట్లు పీడీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
పాఠశాలకు చెందిన గుంటుకు భరత్, బంటు అనిల్ జిల్లా స్థాయిలో జరిగిన వాలీబాల్ ( Volley Ball ) క్రీడోత్సవాల్లో ప్రతిభను కనబరిచినందుకు అభినందిస్తూ వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.
మండలంలోని అనాజీపూర్ గ్రామానికి చెందిన విద్యార్థి బి. ప్రణయ్ సీఎం కప్ రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు నిర్మల, గోవర్ధన్ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికై పాఠశాల , గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా కృషి చేయాలన్నారు.