Commonwealth Games | భారత్ ఖాతాలో రెండో పతకం.. రజతంతో మెరిసిన రిషికాంత సింగ్..!
Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో చనంబమ్ రిషికాంత సింగ్ (Chanambam Rishikanta Singh) రజతంతో మెరిశాడు.
Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో చనంబమ్ రిషికాంత సింగ్ (CRishikanta Singh) రజతంతో మెరిశాడు. పురుషుల 60 కిలోల విభాగంలో సత్త చాటిన అతడు మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు. కామన్వెల్డ్ రికార్డు నెలకొల్పిన రిషికాంత సింగ్ పసిడి వేటలో వెనకబడి.. వెండి వెలుగులు విరజిమ్మాడు. మలేషియా వెయిట్‌లిఫ్టర్ మొహమద్ అనిక్ బిన్ కస్దాన్ స్వర్ణం ఎగరేసుకుపోయాడు. రిషికాంత్, మొహమూద్లు.. ఇద్దరూ విజయవంతంగా 121 కిలోలు ఎత్తడం ఈ క్రీడల చరిత్రలో ఇదే మొదటిసారి.
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో ఆదివారం భారత్‌కు మరో పతకం వచ్చింది. ‘కార్గిల్ విజయ్ దివస్’ రోజున వెయిట్‌లిఫ్టర్ చనంబమ్ రిషికాంత సింగ్ సిల్వర్ మెడల్ కొల్లగొట్టాడు. ఆర్మీ స్పోర్ట్స్‌లో రాటుదేలిన అతడు ఫైనల్లో మలేషియా మొహమద్ అనిక్ బిన్ కస్దాన్తో పోటాపోటీగా 121 కిలోల బరువులు ఎత్తాడు. అయితే.. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో మొహమూద్ మెరుగైన ప్రదర్శన చేయడంతో భారత స్టార్ వెండి పతకానికి పరిమితయ్యాడు.
𝐆𝐚𝐦𝐞𝐬 𝐑𝐞𝐜𝐨𝐫𝐝 𝐢𝐧 𝐒𝐧𝐚𝐭𝐜𝐡! 🏋️♂️
Debutant at the Commonwealth Games, Rishikanta Singh, begins with a sensational 121kg lift in Snatch to set a new Games Record in the men’s 60kg category.
Can the Indian build on a fine start to climb to the top of the podium?… pic.twitter.com/OYnP5i5MQ5
— Sony Sports Network (@SonySportsNetwk) July 26, 2026
క్లీన్ అండ్ జెర్క్‌లో రిషికాంత 143 కిలోలు ఎత్తగా.. మలేషియా వెయిట్‌లిఫ్టర్ ఏకంగా 152 కిలోలు ఎత్తి పసిడి పతకం సాధించాడు. మొత్తంగా ఫైనల్లో రిషికాంత 264 కిలోలు, మొహమూద్ 273 కిలోల బరువులు ఎత్తి శభాష్ అనిపించుకున్నారు. వీరి తర్వాతి స్థానంలో నిలిచిన జోషువా మొబియా(కెన్యా) కాంస్యం సాధించాడు. మరోవిషయం.. 2022లో బర్మింగ్హమ్ ఆతిథ్యమిచ్చిన కామన్వెల్త్ క్రీడల్లో 55 కిలోల విభాగంలో పోటీపడిన రిషికాంత.. ఈసారి 60 కిలోల ఈవెంట్లో దేశం గర్వించే ప్రదర్శన చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

