Harish Rao | ప్రభుత్వ ఆస్పత్రులను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆస్పత్రి క్యాంటీన్లకు బిల్లులను చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచిందని తెలిపారు. రూ.20 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో రోగులు, వైద్యులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానాల్లో రోగులు, డ్యూటీ డాక్టర్లకు ఆహారం సరఫరా చేస్తున్న డైట్ క్యాంటీన్లకు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజులుగా బిల్లులు చెల్లించడం లేదు. దీంతో డైట్ క్యాంటీన్ సప్లై చేస్తున్న వారి బకాయిలు రూ.20 కోట్లకు చేరుకుంది. కొంతకాలంగా బిల్లులు రాకపోవడంతో పాటు సరుకుల ధరలు పెరగడంతో క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేయడం తమకు ఇబ్బంది కలుగుతుందని గాంధీ, ఉస్మానియా, పెట్లబుర్జు, సంగారెడ్డి, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రులకు ఆహారం సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, డీఎంఈ డాక్టర్ ఎన్.వాణి, వైద్య శాఖ కమిషనర్‌ను గురువారం కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ (ఎక్స్ ) వేదికగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వమే తక్షణమే స్పందించి పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు క్యాంటీన్ కాంట్రాక్టర్లు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి టైమ్స్ న్యూస్ నెట్‌వర్క్‌లో ప్రచురితమైన ఒక వార్తకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు.
Due to Congress government negligence, patients and doctors are going without food because of ₹20 crore in unpaid bills to hospital canteens. This negligence, combined with rising costs, endangers lives. Immediate action is crucial to settle the outstanding bills and safeguard… pic.twitter.com/e6xMmreXtS
— Harish Rao Thanneeru (@BRSHarish) May 31, 2024