న్యూఢిల్లీ: కేంద్ర జల సంఘం(CWC Report) ఇవాళ కీలక రిపోర్టును రిలీజ్ చేసింది. దేశంలోని 150 ప్రధాన జలాశయాల్లో నీటి మట్టం 23 శాతం పడిపోయినట్లు పేర్కొన్నది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత నీటిస్థాయి 77 శాతం తక్కువగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ తెలిపింది. గత వారం ఈ రిజర్వాయర్లలో లైవ్ స్టోరేజీ 24 శాతం ఉన్నట్లు చెప్పింది. శుక్రవారం రిలీజ్ చేసిన సీడబ్ల్యూసీ డేటా ప్రకారం.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లైవ్ స్టోరేజ్ మొత్తం 41.705 బిలియన్ క్యూబిక్ మీటర్లు ఉన్నట్లు సీడబ్ల్యూసీ తెలిపింది. అంటే మొత్తం కెపాసిటీలో ఇది 23 శాతమే అని పేర్కొన్నది. గత ఏడాది ఇదే సమయంలో 53.832 బీసీఎం నీరు ఉందని తెలిపింది.
150 ప్రధాన రిజర్వాయర్లలో నీటి సామర్థ్యం మొత్తం 178.784 బీసీఎం కాగా, దేశంలోని మొత్తం స్టోరేజ్ కెపాసిటీలో ఇది 69.35 శాతం అన్నమాట. 150 ప్రధాన రిజర్వాయర్లలో పది ఉత్తర భారతంలోనే ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనే అవి ఉన్నాయి. అస్సాం, జార్ఖండ్, బెంగాల్, త్రిపుర, నాగాలాండ్,బీహార్ రాష్ట్రాల్లో 23 రిజర్వాయర్లు ఉన్నాయి. వాటి లైవ్ స్టోరేజ్ కెపాసిటీ 20 బీసీఎం. ప్రస్తుతం స్టోరేజ్ 5.645 బీసీఎం మాత్రమే ఉన్నది.
గుజరాత్, మహారాష్ట్రలో 49 రిజర్వాయర్లు ఉన్నాయని, వాటి కెపాసిటీ37.1 బీసీఎం. ప్రస్తుతం వాటిల్లో కేవలం 8.833 బీసీఎం స్టోరేజీ ఉన్నట్లు తెలిసింది. యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్‌లో 26 రిజర్వాయర్లు ఉన్నాయి. వాటి కెపాసిటీ 48 బీసీఎం కాగా, ప్రస్తుతం వాటిల్లో 14 బీసీఎం నీటి నిల్వ ఉన్నది. ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడులో 42 రిజర్వాయర్లు ఉన్నాయి. వాటి పూర్తి కెపాసిటీ 53 బీఎంసీ. ప్రస్తుతం కేవలం 7.317 బీసీఎం అందుబాటులో ఉన్నది.
గంగా, ఇండస్, బ్రహ్మపుత్ర, బ్రాహ్మణి, వైతరణి, నర్మద, తాపి, సబర్మతి బేసిన్ల వద్దే సాధారణం కన్నా ఎక్కువ నీరు స్టోరేజీ ఉన్నది. కృష్ణా నదిలో స్టోరేజీ సాధారణం కంటే తక్కువగా ఉన్నది.