Paris Olympics 2024 : ఒలింపిక్స్‌లో చరిత్రలో కనీవినీ ఎరుగని అద్భుతం జరిగింది. హాకీలో నెదర్లాండ్స్ (Netherlands) రెండు స్వర్ణాలు కొల్లగొట్టింది. విశ్వ క్రీడల్లో డచ్ పురుషుల, మహిళల హాకీ జట్లు (Hockey Teams) పసడితో మెరిశాయి. దాంతో, ఒలింపిక్స్ చరిత్రలో హాకీలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన తొలి దేశంగా నెదర్లాండ్స్ చరిత్రపుటల్లో నిలిచింది.
నెదర్లాండ్స్ పురుషుల హాకీ జట్టు హోరాహోరీగా జరిగిన సెమీ ఫైనల్లో జర్మనీని ఓడించి పసిడిని అందించింది. ఆ తర్వాత తమ వంతు అన్నట్టు ఆ దేశ మహిళలు సైతం ఫైనల్లో చైనా (China)కు చెక్ పెట్టి బంగారాన్ని ఒడిసిపట్టింది.
శనివారం జరిగిన మహిళల హాకీ ఫైనల్లో నెదర్లాండ్స్, చైనా జట్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. ఆరో నిమిషంలో చైనా ఫార్వర్డ్ చెన్ యి తొలి గోల్ కొట్టింది. అనంతరం చైనా డిఫెన్స్ ఆయుధంగా నెదర్లాండ్స్‌ను నిలువరించే ప్రయత్నం చేసింది. కానీ, డచ్ ప్లేయర్ ఇబ్బి జాన్సెన్(Yibbi Jansen) సూపర్ గోల్‌తో స్కోర్ సమం అయింది.
అనంతరం నిర్వహించిన షూటౌట్లో నెదర్లాండ్స్ అమ్మాయిల జట్టు 3-1తో చైనాను ఓడించింది. మరోవైపు నెదర్లాండ్స్ పురుషుల జట్టు జర్మనీని మట్టికరిపించిన స్వర్ణ పతకాన్ని తన్నుకుపోయింది. మ్యాచ్ సమయానికి స్కోర్లు 1-1తో సమం కాగా షూటౌట్లో డచ్ ఆటగాళ్లు సత్తా చాటారు. దాంతో, 3-1తో నెదర్లాండ్ జట్టు విజేతగా నిలిచింది.
𝑯𝒊𝒔𝒕𝒐𝒓𝒊𝒄 𝒅𝒐𝒖𝒃𝒍𝒆 𝑮𝒐𝒍𝒅 𝒊𝒏 #Hockey
Netherlands became the first ever country to win the #Gold medal in both men’s and women’s hockey event at an #Olympics. #historical #Paris2024 #hockeyinvites #Hockeyequals #Netherlands pic.twitter.com/WDxpPNVBqp
— International Hockey Federation (@FIH_Hockey) August 10, 2024