Tragedy | ప్రకాశం జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
Tragedy | ఇసుక తవ్వకాలతో ఏర్పడ్డ గుంతల లోతు తెలియక ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన ప్రకాశం జిల్లా లో చోటు చేసుకుంది.
అమరావతి : ఇసుక తవ్వకాలతో ఏర్పడ్డ గుంతల లోతు తెలియక ఇద్దరు విద్యార్థులు (Students ) మృతి చెందిన విషాద ఘటన ప్రకాశం జిల్లా (Prakasam district) లో చోటు చేసుకుంది. జిల్లాలోని పామూరు మండలం డివి పాలెం గ్రామానికి చెందిన పదవతరగతి విద్యార్థులు గౌతమ్, చరణ్ చదువుతున్న పాఠశాలకు రెండు రోజులు సెలవులు రావడతో ఇద్దరు సమీపంలోని వాగులో స్నానానికి వెళ్లారు.
వాగులో ఇసుక రవాణా చేయడంతో గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలు నిండిపోవడం, అక్కడ లోతు ఉండడాన్ని గమనించక స్నానానికి వాగులో దిగారు. ఈత రాని ఇద్దరు విద్యార్థులు గుంతలో పడి దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలించగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

