జోగులాంబ గద్వాల : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని (Failure Congres) మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) అన్నారు. బుధవారం మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ను ( Congress ) నమ్మే పరిస్థితిలో లేరని వెల్లడించారు.మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉండాలని, పార్టీ నుంచి ఎవరూ పోటి చేసిన గెలిపించే దిశగా కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలలోకి తీసుకెళ్లాలని సూచించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పాలమూరు సస్యశ్యామలం చేయడానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్ల పనులను 90శాతం పూర్తి చేశారని తెలిపారు. మిగిలిన 10 శాతం కాలువల నిర్మాణ పనులను కాంగ్రెస్ పూర్తి చేసి ప్రజలకు నీరు అందించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి, ఆంధ్రాకు వత్తాసు పలుకుతుందని ఆరోపించారు.
జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుల ద్వారా రైతులకు నీరు ఇవ్వకుండా క్రాప్ హాలిడే ప్రకటించడం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు.ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకెళ్ళి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేవిధంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.