Manu Bhaker : ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన మను భాకర్ (Manu Bhaker) ఇప్పుడు ఇష్టమైన ఫుడ్ తింటోంది. విశ్వ క్రీడల్లో రెండు కాంస్యా(Bronze Medals)లతో చరిత్ర సృష్టించిన ఆమె తాజాగా తన ఫేవరెట్ వెజ్ రోల్‌ను రుచి చూసింది. ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ కూడా చేసింది.
పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో పాల్గొనడానికి ముందుగా ఆమె కెఎఫ్సీ వెజ్ స్పైసీ రోల్ (KYC Veg Spicy Roll)డిష్‌ను మనసారా ఆరంగించింది. చిన్న బ్రేక్ కోసం స్వదేశానికి. నాకెంతో ఇష్టమైన కెఎఫ్సీ వెజ్ స్పైసీ రోల్‌ను ఆరగిస్తున్నా అంటూ భాకర్ క్యాప్షన్ రాసింది. ఇంకేముంది ఆ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పారిస్ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో మను భాకర్ కంచు మోత మోగించింది. తద్వారా ఒకే విశ్వక్రీడల్లో రెండు పతకాలు కొల్లగొట్టిన భారత తొలి షూటర్‌గా ఆమె రికార్డు నెలకొల్పింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత పోటీల్లో మను మూడో స్థానంతో దేశానికి తొలి మెడల్ అందించింది. అనంతరం సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్సడ్ ఈవెంట్లో మళ్లీ సత్తా చాటిన ఆమె కాంస్యంతో మెరిసింది.
దాంతో, దేశానికి రెండో పతకం సాధించి పెట్టింది. అందుకని ఆమెకు భారత ప్రభుత్వం స్వదేశంలో ఘన స్వాగతం పలికింద. అంతేకాదు భారత ఒలింపిక్ సంఘం భాకర్‌ను ముగింపు వేడుకల్లో పతకధారిగా ఎంపిక చేసింది. ఆగస్టు 11న జరుగనున్న క్లోజింగ్ సెరెమొనీలో ఆమె హాకీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్‌తో పాటు భాకర్ జాతీయ జెండాతో పరేడ్ చేయనుంది.