Royal Enfield Classic 350 | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) ఈ నెల 12న భారత్ మార్కెట్లో అప్డేటెడ్ క్లాసిక్ 350 (Classic 350) మోటారు సైకిల్ ఆవిష్కరించనున్నది. రాయల్ ఎన్ఫీల్డ్ మోటారు సైకిళ్లలో బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా నిలిచిన ‘క్లాసిక్ 350’.. నిప్, టక్ అప్ డేట్ తోపాటు పలు ఏస్థటిక్, ఫీచర్ మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుత క్లాసిక్ 350 మోటారు సైకిల్ లో ఉన్న ఫీచర్లతోపాటు కొన్ని మార్పులు జరుగనున్నాయని తెలుస్తోంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ తోపాటు కొత్త పెయింట్ ఆప్షన్లతో క్లాసిక్ 350 అప్ డేటెడ్ మోటారు సైకిల్ వస్తోంది.
అప్డేటెడ్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, డిస్టెన్స్ టూ ఏంప్టీ, టాప్ ఎండ్ క్లాసిక్ 350 మోటారు సైకిల్‌తో ట్రిప్పర్ నేవీగేషన్ పాడ్ ఫీచర్ ఉంటుంది. జే-సిరీస్ 349సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ విత్ 5-స్పీడ్ గేర్ బాక్స్ కొనసాగుతుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 6100 ఆర్పీఎం వద్ద 20.2 బీహెచ్పీ విద్యుత్, 4000 ఆర్పీఎం వద్ద 27 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ట్విన్ డబుల్ ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ విత్ 41ఎంఎం టెలిస్కోపిక్ పోర్క్స్ ఎట్ ఫ్రంట్ విత్ 130 ఎంఎం ఆఫ్ ట్రావెల్, రేర్ గెట్స్ 6-స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్, 300 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 270 ఎంఎం రేర్ డిస్క్ బ్రేక్స్ విత్ డ్యుయల్ చానెల్ ఏబీఎస్ ఉంటాయి.
న్యూ క్లాసిక్ 350 మోటారు సైకిల్ 19 అంగుళాల ఫ్రంట్, 18 అంగుళాల రేర్ స్పోక్డ్ వీల్స్ తో వస్తోంది. ప్రస్తుతం ఈ మోటారు సైకిల్ ధర రూ.1.93 లక్షల నుంచి రూ.22.5 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది. అప్ డేటెడ్ క్లాసిక్ 350 బైక్ ధరలు స్వల్పంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 350-500 సీసి సెగ్మెంట్లో హీరో మావ్రిక్ 440, హార్లే డేవిడ్సన్ ఎక్స్440, ట్రయంఫ్ స్పీడ్ 400, బైనెల్లి ఇంపీరియల్ 400 తదితర మోటారు సైకిళ్లకు 2025-రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ గట్టి పోటీ ఇవ్వనున్నది.