Paris Olympics 2024 | అమాంతం ఎత్తిపడేసిన ప్రత్యర్థి.. మహిళా రెజ్లర్ మెడకు తీవ్రగాయం
Paris Olympics 2024 : ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించాలనే ఓ రెజ్లర్ (Wrestler) కల చెదిరింది. ప్రత్యర్థి అమాంతం ఎత్తి పడేయంతో ఊహించని విధంగా ఆమె గాయపడింది. రొమేనియా రెజ్లర్ కటలినా అక్సెంటే (Catalina Axente) తీవ్ర గాయాలపాలైంది.
Paris Olympics 2024 : ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించాలనే ఓ రెజ్లర్ కల చెదిరింది. ప్రత్యర్థి అమాంతం ఎత్తి పడేయంతో ఊహించని విధంగా ఆమె గాయపడింది. మహిళల ఫ్రీ స్టయిల్ 76 కిలోల విభాగం 16వ రౌండ్లో రొమేనియా రెజ్లర్ కటలినా అక్సెంటే (Catalina Axente) తీవ్ర గాయాలపాలైంది.
శనివారం ఉదయం జరిగిన బౌట్ సమయంలో అమెరికా రెజ్లర్ కెన్నెడీ బ్లేడ్స్ (Kennedy Blades) ఆమెను అమాంతం ఎత్తి మ్యాట్ మీద పడేసింది. దాంతో, కటలినా మెడకు తీవ్ర గాయమైంది. ఊహించని పరిణామంతో షాక్ తిన్న ఆమెను ఒలింపిక్స్ సిబ్బంది స్ట్రెచర్ మీద తరలించి అత్యవసర వైద్యం అందించారు.
🚨🚨 JUST IN
This is a very bad scene . Looks like the injury is very serious 🥹
Axente Catalina of Romania being carried on the stretcher.
#wrestling #Olympics #Paris2024 #GOLD #ImaneKhelif #Jailer #Jailer2 #Olympics2024Paris #Olympic2024 pic.twitter.com/xp6nYoydfE
— Truclaw🌊 (@truclaw) August 10, 2024
యూరో చాంపియన్‌షిప్స్‌లో రెండుసార్లు కాంస్యం నెగ్గిన అక్సెంటే, అమెరికా కెరటం కెన్నెడీకి గట్టి పోటీనిచ్చింది. అయితే.. మొదటి రౌండ్లో 6-0తో ఆధిక్యం సాధించిన అమెరికా రెజ్లర్ ఆ తర్వాత రెచ్చిపోయింది.

అక్సెంటీని వెనకనుంచి అదిమి పట్టుకొని అలానే వెనక్కి ఎత్తి కింద పడేసింది. దాంతో, అక్కడున్నవాళ్లంతా ఒకింత షాక్‌కు గురయ్యారు. మెడకు గాయంతో బాధపడుతున్న అక్సెంటీని ఒలింపిక్స్ సిబ్బంది స్ట్రెచర్ మీద తీసుకెళ్లి వైద్యం అందించారు. అయితే.. ఆమె ఆరోగ్యం ఎలా ఉంది? అనేది ఇంకా తెలియలేదు.
ఇవి కూడా చదవండి
- Paris Olympics 2024 | రెజ్లర్ రితికకు చుక్కెదురు.. ఆమె ఫైనల్ చేరితే మరో చాన్స్..?
- Manchu Vishnu | మంచు మనసు.. కూతురు పుట్టినరోజున ‘మా’కు రూ.10 లక్షల విరాళం ఇచ్చిన హీరో విష్ణు
- Koppula Eshwar | జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం నిరసన దీక్షలో పాల్గొనడం బాధాకరం : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
- Kanguva Trailer | సూర్య ‘కంగువ’ నుంచి క్రేజీ అప్డేట్.. ట్రైలర్ వచ్చేది ఆరోజే.!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

