Manchu Vishnu | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. తన కూతురు ఐరా విద్య మంచు పుట్టిన రోజు సందర్భంగా మా అసోసియేషన్‌కి పది లక్షల విరాళాన్ని ప్రకటించారు. అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల సంక్షేమం కోసం రూ.10 లక్షలు విరాళంగా అందించారు. కళాకారులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సపోర్ట్, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని ఉపయోగించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
గత మూడు సంవత్సరాలలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విష్ణు నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధిని సాధించిడమే కాకుండా మా భవనంపై ఫోకస్ పెట్టింది. ఈ మధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్లు, సినీ ఆర్టిస్టుల మీద సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌లు, ట్రోలింగ్స్ చేసేవారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
సోషల్ మీడియాలో చిన్న పిల్లలు, హీరో హీరోయిన్లపై డార్క్ కామెడీ పేరుతో ట్రోలింగ్ చేస్తూన్న తెలుగు యూట్యూబర్లకు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. నటినటులను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48గంటల్లో తొలగించాలని లేకపోతే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంచు విష్ణు యూట్యూబ్ వేదికగా హెచ్చరించాడు. అయితే చెప్పినట్లుగానే 48 గంటల అనంతరం సినీ నటులు, వారి కుటుంబ సభ్యుల పట్ల అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్‌పై కొరడా ఝుళిపించింది. ఇక విష్ణు చేపట్టిన ఈ చర్యలను టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలకు చెందిన ఆర్టిస్టులు కూడా ప్రశంసించారు.
సినిమాల విషయానికి వస్తే.. విష్టు ప్రస్తుతం కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడు. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు స్వీయ నిర్మాణంలో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa). మంచు విష్ణు (Manchu Vishnu) కథానాయకుడిగా వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ మూవీని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also read..