Crime News | హైదరాబాద్ నగర పరిధిలోని హుమాయున్ నగర్ పరిధిలోని విజయనగర్ కాలనీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఆంధ్రాబ్యాంకు సమీపంలో కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో థార్ వాహనం వేగంగా వచ్చి రెండు ద్విచక్ర వాహనాలను, ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం థార్ వాహనాన్ని సీజ్ చేశారు. అయితే, ఘటన అనంతరం కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. అయితే, ప్రమాదం సమయంలో మహిళ కారు నడిపినట్లుగా స్థానికులు తెలిపారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు వాహనానికి సంబంధించి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.