Kanguva | తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). శివ (siva) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోంది. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ౩డీ ఫార్మాట్లో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కంగువ గ్లింప్స్‌తో పాటు పోస్టర్లు విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా ట్రైలర్ అప్డేట్ను ఇచ్చింది.
ఈ మూవీ ట్రైలర్‌ను ఆగష్టు 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సూర్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుంది. 10 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో పాపులర్ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది.
The anticipation ends now! The time for glory is arriving ✨
Get ready for a celebration like no other ❤️🔥
The grand #KanguvaTrailer is all set to be yours from 12th August#KanguvaFromOct10 🦅 #Kanguva@Suriya_offl @DishPatani @thedeol @directorsiva @ThisIsDSP #StudioGreen… pic.twitter.com/OJ8eRvIv6X
— Studio Green (@StudioGreen2) August 10, 2024
Also read..