Women’s T20 WC | ఈ ఏడాది బంగ్లాదేశ్ వేదికగా వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉన్నది. ప్రస్తుతం ఆ దేశంలో రాజకీయ అస్థిరత నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భద్రతా పరమైన ఆందోళనల కారణంగా టోర్నీ ఆ దేశంలోనే జరుగుతుందా..? మరో చోటుకి తరలిస్తారా? అన్న దానిపై సందిగ్ధం నెలకొన్నది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) టోర్నమెంట్ నిర్వహణపై దేశ సర్వీస్ చీఫ్ నుంచి భద్రతాపరమైన హామీ కోరింది. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఆ తర్వాత ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో అక్టోబర్‌లో మహిళల టీ20 వరల్డ్ కప్‌ను నిర్వహించడం కష్టసాధ్యమని భావిస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం టీ20 ప్రపంచకప్‌ని బంగ్లాదేశ్‌లోని సిల్హెట్, మీర్పూర్లో నిర్వహించాలని నిర్ణయించారు. టోర్నీ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచులు సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్‌కు బీసీబీ టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించి భద్రతపై లేఖ రాసింది. మరో వైపు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సైతం బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై దృష్టి సారించింది. టోర్నీని అదే సమయానికి మరో దేశంలో నిర్వహించేందుకు సైతం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదే జరిగితే భారత్, యూఏఈ, శ్రీలంకలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం లభించనున్నది. బీసీబీ అంపైరింగ్ కమిటీ చైర్మన్ ఇఫ్తికార్ అహ్మద్ మిథూ మాట్లాడుతూ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. టోర్నీకి రెండు నెలల సమయం మాత్రమే ఉన్నందున భద్రత విషయంలో హామీ ఇవ్వాలని ఆర్మీ చీఫ్‌కు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.
Indian Men’s Hockey team | హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్‌చంద్‌కు భారత హాకీ టీమ్ నివాళులు.. Video
Harish Rao | రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు ఎమ్మెల్యే హరీశ్‌రావు అభినందనలు