Harish Rao | హైదరాబాద్ : పారిస్ ఒలింపిక్స్ 2024లో రెజ్లింగ్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్న భారత మల్లయోధుడు అమన్ సెహ్రావత్‌కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కేవలం 21 సంవత్సరాలకే అద్భుతమైన ఆటతీరుతో తన దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారు. ఇది భారతదేశానికి గర్వకారణం అంటూ హరీశ్‌రావు పేర్కొన్నారు.
ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో భారత మల్లయోధుల పతక హవా దిగ్విజయంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పసిడి పతక ఆశలు ఆవిరైన వేళ తాను ఉన్నానంటూ యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ చిరుతలా దూసుకొచ్చాడు. జపాన్ రెజ్లర్ చేతిలో సెమీస్‌లో ఓడిన అమన్..కాంస్య పతక పోరులో బెబ్బులిలా విరుచుకుపడ్డాడు. పూర్టోరికో రెజ్లర్ క్రజ్ డెరియన్కు చుక్కలు చూపిస్తూ వరుస రౌండ్లలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆదిలో నెమ్మదించినా..పట్టు బిగించిన తర్వాత ప్రత్యర్థిని మెలికలు తిప్పుతూ వరుస పాయింట్లు కొల్లగొట్టాడు. డెరియన్ పుంజుకునేందుకు ఏ మాత్రం అవకాశమివ్వని అమన్..అతి పిన్న వయసులో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. తద్వారా పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆరో పతకాన్ని అందించి ఔరా అనిపించాడు. అమన్ కాంస్య పతకంతో వరుసగా ఐదు ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో పతకాలు మనకు దాసోహమయ్యాయి.
భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ దేశానికి ఆరో పతకాన్ని అందించాడు. మహిళల విభాగంలో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ అసమాన పోరాటంతో స్వర్ణం లేదా రజతం ఖాయం చేసినా ఫైనల్ పోరుకు కొన్నిగంటల ముందు ఆమె నిర్దేశిత బరువు కంటే వంద గ్రాములు అధికంగా ఉందని ‘అనర్హత వేటు’ ఎదుర్కోవడంతో ఈ క్రీడలో పతకంపై ఆశలు అడుగంటిన వేళ అమన్ మాత్రం ఆ లోటును తన పతకంతో పూరించాడు. పురుషుల 57 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో బరిలోకి దిగిన అమన్ సెమీస్‌లో ఓడినా కాంస్య పోరులో మాత్రం అదరహో అనిపించాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అమన్ 13-5తో క్రజ్ డెరియన్ (పూర్టోరికో)ను ఓడించి కంచు మోత మోగించాడు. రెజ్లింగ్‌లో భారత్‌కు పారిస్‌లో ఇదే తొలి పతకం కాగా మొత్తంగా ఆరోవది. వినేశ్ పతకం విషయంలో నిరాశగా ఉన్న భారత క్రీడాభిమానులకు అమన్ కాంస్యం కాస్త స్వాంతన కలిగించేదే. అతడు తెచ్చింది కాంస్యమే అయినా ప్రస్తుత పరిస్థితులలో అది పసిడి కంటే ఎన్నో రెట్లు విలువైనది.
A huge shoutout to Aman Sehrawat for bringing home Bronze🥉 in wrestling at the #ParisOlympics2024 ! At just 21, he’s shown incredible grit and determination. Proud moment for India! pic.twitter.com/FYx9SgZbHP
— Harish Rao Thanneeru (@BRSHarish) August 10, 2024
ఇవి కూడా చదవండి..
Hockey Team | భారత్ చేరుకున్న పురుషుల హాకీ టీమ్.. ఢిల్లీలో ఘన స్వాగతం
Imane Khelif: గోల్డ్ మెడల్ గెలిచిన వివాదాస్పద మహిళా బాక్సర్
Karlos Nasar | 404 కిలోలు ఎత్తిపడేశాడు.. ప్రపంచ రికార్డుల దుమ్ము దులిపేశాడు