Karlos Nasar | 404 కిలోలు ఎత్తిపడేశాడు.. ప్రపంచ రికార్డుల దుమ్ము దులిపేశాడు
బల్గేరియా వెయిట్ లిఫ్టర్ కార్లొస్ నాసర్ రికార్డు బరువు ఎత్తి పారిస్‌లో కొత్త చరిత్ర లిఖించాడు. 21 ఏండ్ల ఈ కుర్రాడు పురుషుల 89 కిలోల విభాగంలో ఏకంగా 404 కిలోల బరువును ఎత్తి ఒలింపిక్ రికార్డులతో పాటు ప్రపంచ రికార్డుల దుమ్ము దులిపాడు.
- బల్గేరియా వెయిట్‌లిఫ్టర్ కార్లొస్ ప్రపంచ రికార్డు
Karlos Nasar | పారిస్: బల్గేరియా వెయిట్ లిఫ్టర్ కార్లొస్ నాసర్ రికార్డు బరువు ఎత్తి పారిస్‌లో కొత్త చరిత్ర లిఖించాడు. 21 ఏండ్ల ఈ కుర్రాడు పురుషుల 89 కిలోల విభాగంలో ఏకంగా 404 కిలోల బరువును ఎత్తి ఒలింపిక్ రికార్డులతో పాటు ప్రపంచ రికార్డుల దుమ్ము దులిపాడు. స్నాచ్‌లో 180 కిలోలు ఎత్తిన కార్లొస్.. క్లీన్ అండ్ జర్క్‌లో రికార్డు స్థాయిలో 224 కిలోల బరువును ఎత్తేశాడు. క్లీన్ అండ్ జర్క్‌లో ఇప్పటి వరకూ ఇదే అత్యుత్తమం.
కాగా గతేడాది బాత్రూమ్లో గోడ కూలి తీవ్ర గాయాల పాలై సర్జరీ చేయించుకున్న కార్లొస్.. ఏడాది కాలంలో పూర్తిగా కోలుకోవడమే గాక రికార్డు స్థాయిలో బరువును ఎత్తి పసిడి గెలుచుకోవడం విశేషం. ఇదే పోటీలో రజతం సాధించిన కొలంబియా అథ్లెట్ యీసన్ లోపెజ్ (390 కిలోలు) స్నాచ్‌లో 182 కిలోలతో వరల్డ్ రికార్డు నమోదు చేసుకున్నాడు. ఇటలీ ప్లేయర్ అంటానియో 383 కిలోలు ఎత్తి కాంస్యం గెలుచుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

